Karnataka CM: ఖర్గే ఫార్ములా వర్కవుట్: సస్పెన్స్‌కు తెర- కొత్త సీఎం రేపే ప్రమాణం

బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్ఠంభనకు ఎట్టకేలకు తెరపడింది. దేశ రాజధాని వేదికగా మూడు రోజులపాటు ఉత్కంఠభరితంగా సాగిన కర్ణాటక రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తెర దించింది. ఇద్దరు ఉద్దండులు సిద్ధరామయ్య- డికే శివకుమార్ లల్లో ఎవరిని ముఖ్యమంత్రిగా అపాయింట్ చేయాలనే విషయంపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంది.

శనివారమే ఫలితాలు వెలువడినప్పటికీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై పీటముడి పడిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి సీఎల్పీ భేటీ అయినప్పటికీ- ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేకపోయింది. సీఎల్పీ నేతను ఎంపిక చేసే సర్వాధికారాలను పార్టీ అధిష్ఠానానికి వదిలివేసింది. దీనితో కర్ణాటక రాజకీయాలు సోమవారం నుంచి హస్తిన వేదికగా ముమ్మరంగా సాగాయి.

Siddaramaiah

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. 135 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 43 శాతానికి పైగా ఓట్ల షేర్‌ను సాధించింది. సీఎల్పీ నేతను ఎన్నుకునే విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. దీనితో అధిష్ఠానం జోక్యం చేసుకుంది.

కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును ఖరారు చేసింది. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ను నియమించింది. 10 జన్‌పథ్‌ నివాసంలో జరిగిన కీలకమైన సమావేశంలో ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సిద్ధరామయ్య కూడా ఇదే సమావేశంలో పాల్గొన్నారు.

కొత్త ముఖ్యమంత్రిగా గురువారం సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, మంత్రులు ప్రమాణం చేయనున్నారు. డీకే శివకుమార్‌, ఆయన వర్గానికి మంత్రివర్గంలో ప్రాధాన్యత గల శాఖలను కేటాయించాలని షరతు ఉంది. డీకేకు విద్యుత్, జల వనరులు మంత్రిత్వ శాఖలను కేటాయించే అవకాశం ఉంది.

Siddaramaiah

ఆయన వర్గానికి చెందిన ఎమ్యెల్యేల్లో ఇద్దరి నుంచి నలుగురిని కేబినెట్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. వారికీ ప్రాధాన్యత గల శాఖలను కేటాయించాల్సి ఉంటుంది. ఈ మేరకు మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించిన ఫార్ములాకు ఎట్టకేలకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అంగీకరించారు. తమ అంగీకారాన్ని తెలియజేశారు. సిద్ధరామయ్య పేరును ఖర్గే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+