Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రంగంలోకి దిగిన డీకే శివకుమార్, మంత్రుల మధ్య ఏం జరుగుతోంది, సీఎం డిన్నర్ పార్టీలతో అలర్ట్?

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఆ పార్టీ సీనియర్ నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ స్వయంగా సతీష్ జారకిహోళిని కలుసుకుని రహస్యంగా చర్చలు జరిపారు.

కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా పూర్తి కాలేదు. కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్, సతీష్ జారకిహోళి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెళగావిలో పర్యటించారు. కానీ ఆ సందర్భంగా డీకే శివకుమార్ ఆయన పని ఆయన చూసుకుని వెళ్లారే కాని మంత్రులు లక్ష్మీ హెబ్బాల్కర్, సతీష్ జారకిహోళిలతో మాట్లాడలేదు.

Karnataka DCM DK Sivakumar is personally holding talks with dissident ministers

కొన్ని కారణాలతో గైర్హాజరైన మంత్రి సతీష్ జారకిహోళి నివాసానికి డీకే శివకుమార్ స్వయంగా వెళ్లి రహస్యంగా చర్చించారు. బెళగావి ఇష్యూలో సతీష్ జారకిహొళి సైడ్ లైన్ అయ్యారని తెలిసింది. అంతకుముందు అల్పాహార సమావేశానికి కూడా మంత్రి సతీష్ జారకిహోళి హాజరుకాకుండా అటువైపు కూడా చూడకపోవడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోక్యం చేసుకోకుండా సైలెంట్ గా ఉండిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మంత్రి సతీష్ జారకిహోళి అసంతృప్తిని చల్లార్చేందుకు డీకే శివకుమార్ ముందుకు వచ్చారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో బెళగావి ప్రాంతంలో ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సతీష్ జారకిహోళి దూరం పాటించడంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సైతం షాక్ అయ్యిందని తెలిసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి దళితులను ముఖ్యమంత్రి చెయ్యాలని, సీఎం మార్పుపై చర్చ జరుగుతుండగా సతీష్ జారకిహోళి ఇలా వ్యవహరించడంతో కర్ణాటక ప్రభుత్వంలోని పెద్దలు హడలిపోతున్నారు. గత వారం హోమ్ మంత్రి డాక్టర్ పరమేశ్వర్ నివాసంలో విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విందు సమావేశంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్నారని తెలిసింది.

మొత్తం మీద కర్ణాటకలో రెండున్నర ఏళ్లు సిద్దరామయ్య సీఎంగా, మరో రెండున్నర సంవత్సరాలు డీకే శివకుమార్ సీఎంగా ఉంటారని అనుకుంటే ఇప్పుడు దళిత సీఎం ముఖ్యమంత్రి డిమాండ్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో పాటు కార్యకర్తలకు పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది. అయితే సిద్దరామయ్య, డీకే శివకమార్ సైలెంగా ఎవరి స్కెచ్ లు వాళ్లు వేసుకుంటూ ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటున్నారని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+