సెల్ఫీ కోసం కార్యకర్త, కర్ణాటక మంత్రి ఏం చేశారంటే, వైరల్ వీడియో, స్మార్ట్ ఫోన్!

Recommended Video

    సెల్ఫీ కోసం కార్యకర్త, కర్ణాటక మంత్రి ఏం చేశారంటే, వైరల్ వీడియో

    బెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్ కు మళ్లీ కోపం వచ్చింది. మంత్రితో సెల్ఫీ తీసుకోవాలని ముచ్చటపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్మార్ట్ ఫోన్ కాస్త ముక్కలు కావడంంతో ఆపార్టీ నాయకులు షాక్ కు గురైనారు.

    రాహుల్ గాంధీ మీటింగ్

    రాహుల్ గాంధీ మీటింగ్

    ఫిబ్రవరి 10వ తేదిన కర్ణాటకలోని బళ్లారి జిల్లా హోస్ పేట్ లోని విజయనగర కాలేజ్ క్రీడా మైదానంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగర కాలేజ్ క్రీడా మైదానంలో పనులు పరిశీలించడానికి మంత్రి డీకే శివకుమార్ వెళ్లారు.

    కాంగ్రెస్ పార్టీ కార్యకర్త

    కాంగ్రెస్ పార్టీ కార్యకర్త

    హోస్ పేట్ లోని విజయనగర కాలేజ్ క్రీడా మైదానంలో పనులు పరిశీలించడానికి వెళ్లిన మంత్రి డీకే. శివకుమార్ పక్కనే వెలుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. అంతే మంత్రి డీకే. శివకుమార్ కు చిర్రెత్తింది.

    స్మార్ట్ ఫోన్ ముక్కలు

    స్మార్ట్ ఫోన్ ముక్కలు

    కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతి మీద మంత్రి డీకే. శివకుమార్ సహనం కోల్పోయి ఒక్క దెబ్బ వేశాడు. అంతే స్మార్ట్ ఫోన్ కాస్త కిందపడి ముక్కలు అయ్యింది. మంత్రి డీకే. విషయం గమనించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ కు గురైనారు. మంత్రి శివకుమార్ కార్యకర్త మీద చెయ్యి చేసుకున్న వీడియో వైరల్ అయ్యింది.

    విద్యార్థి మీద మంత్రి !

    మూడు నెలల క్రితం బెళగావిలో మంత్రి డీకే. శివకుమార్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన వెనుక నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న విద్యార్థి మీద ఆయన చెయ్యి చేసుకున్నారు. ఆ సమయంలో మంత్రి డీకే. శివకుమార్ విద్యార్థి మీద చెయ్యి చేసుకున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+