కర్నాటక ఎన్నికలు-దిగ్విజయ ఎగ్జిట్ పోల్: మెజార్టీకి దగ్గర్లో బీజేపీ, కాంగ్రెస్‌కు 80 స్థానాలే
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ సర్వేల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ సర్వేలు హంగ్ వస్తాయని చెబితే, కొన్ని కాంగ్రెస్, మరికొన్ని బీజేపీ గెలుపుకు దగ్గరగా ఉంటాయని చెబుతున్నాయి.
దిగ్విజయ టీవీ ఛానల్ సర్వే ప్రకారం బీజేపీకి 103-107, కాంగ్రెస్ పార్టీకి 76-80, జేడీఎస్‌కు 31-35, ఇతరులకు 4-8 సీట్లు వస్తాయి. స్వతంత్రులతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుందని ఈ ఫలితంలో వెల్లడైంది.
సీ ఓటర్ సర్వే ప్రకారం బీజేపీకి 103, కాంగ్రెస్‌కు 93, జేడీఎస్‌కు 25, ఇతరులకు 1 సీటు వస్తాయని వెల్లడించింది.

కాగా, 2019 సార్వత్రిక ఎన్నికలకు, మరో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన కర్నాటక శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
బీజేపీ ఓడిపోతే 2019 ఎన్నికలకు ముందు ఆ పార్టీకి గట్టి దెబ్బ. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాహుల్ గాంధీ నాయకత్వంపై మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఇరు పార్టీలు ఈ ఎన్నికలను కీలకంగా తీసుకున్నాయి. హంగ్ ఏర్పడుతుందా లేక ఏ పార్టీకైనా ప్రజలు ఏకపక్షంగా పట్టం కడతారా అనే దానిని ఎగ్జిట్ పోల్ అంచనాల ఆధారంగా దాదాపు లెక్క వేసుకోవచ్చు.
దిగ్విజయ టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం..
కాంగ్రెస్ పార్టీ - 76-80
భారతీయ జనతా పార్టీ -103-107
జేడీఎస్ - 31-35
ఇతరులు - 4-8
సీ ఓటరు సర్వే ప్రకారం..
కాంగ్రెస్ పార్టీ - 93
భారతీయ జనతా పార్టీ -103
జేడీఎస్ - 25
ఇతరులు -1
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications