పాపం మాజీ సీఎంకు సొంత కారు కూడా లేదు, ఆస్తులు మాత్రం ఎన్ని కోట్లు అంటే ?, షాక్ మీద షాక్ !
కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా మాజీ సీఎంలు, మంత్రులు, ప్రముఖులు వారి ఆస్తి వివరాలను ఎన్నికల అధికారులకు సమర్పిస్తున్నారు. హావేరీ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఆయన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ తిరగడానికి సొంతంగా కారు కూడా లేదని ఎన్నికల అఫిడవిట్ సమర్పించడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ తనకు రూ. 54 కోట్ల ఆస్తులు ఉన్నాయని అధికారికంగా ప్రకటించారు. అయితే తనకు సొంత వాహనం లేదని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. హావేరీ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బసవరాజ్ బోమ్మయ్ తనకు రూ. 29.58 కోట్లు ఆస్తులు ఉన్నట్లు సమాచారం అందించారు. దీనికి తోడు రూ 20 కోట్లు విలువైన ఆస్తులు తనకు వారసత్వంగా ఆస్తి వచ్చిందని ప్రకటించారు.

హావేరి జిల్లా ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను బసవరాజ్ బోమ్మయ్ వెల్లడించారు. మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ దగ్గర 3 లక్షల నగదు బ్యాంక్, ఫైనాన్స్ కంపెనీల్లో రూ. 51 లక్షల డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. వివిద కంపెనీల్లో రూ 3.30 కోట్లు షేర్లు ఉన్నాయని బసవరాజ్ బోమ్మయ్ వివరించారు. మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ దగ్గర రూ 1.59 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని వివరించారు.
అయితే మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కి సంచరించడానికి తనకు సొంతంగా ఏ వాహనం లేదని ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. రూ. 6.12 కోట్ల చరాస్తులు, రూ.96.8 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ.7 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి ఉన్నాయని, అలాగే రూ. 6.3 కోట్లు విలువైన వాణిజ్య భవనాలు ఉన్నాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ వివరించారు. బసవరాజ్ బోమ్మయ్ తండ్రి బోమ్మయ్ కూడా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు.
బెంగుళూరు, షింగ్లావిలో రూ 9.18 కోట్లు విలువైన రెండు ఇండ్లతో పాటు రూ. 23.45 కోట్ల విలువైన స్థిరాస్తి ఉందని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ వివరించారు. తనకు రూ 5.31 కోట్లు అప్పులు ఉన్నాయని, రూ. 20 కోట్లు వారసత్వ ఆస్తి వచ్చిందని, తన భార్యకు రూ. 1.32 కోట్ల విలువైన ఆస్తి ఉందని, తన కుమార్తెకు రూ 1.53 కోట్ల వారసత్వ ఆస్తి ఉందని కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఎన్నికల అఫిడవిట్ సమర్పించారు. మొత్తం మీద కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ సంచరించడానికి సొంత కారుతో పాటు ఎలాంటి వాహనం లేదని ఎన్నికల అధికారులకు అఫిడవిట్ సమర్పించడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications