తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరిపై సంచలన ఆరోపణలు చేసిన ఐపీఎస్

కర్ణాటక క్యాడర్ కు చెందిన తెలుగు సీనియర్ ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఐపీఎస్ అధికారిణి డీ రూప.. రోహిణి సింధూరిపై ఏకంగా 19 ఆరోపణలు చేశారు.

బెంగళూరు: విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారంటూ గుర్తింపు పొందిన కర్ణాటక కేడర్‌కు చెందిన తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరిని వివాదాలు చుట్టు ముట్టాయి. ఇదివరకు మైసూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో తోటి ఐఎఎస్ అధికారిణి, సిటీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ శిల్పా నాగ్‌తో వివాదం గతంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇప్పుడు మళ్లీ వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు.

 తరచూ వార్తల్లో..

తరచూ వార్తల్లో..

జిల్లా కలెక్టర్ హోదాలో రోహిణి సింధూరి తనపై రోజూ ఒత్తిడి తీసుకొస్తున్నారని, దీన్ని భరించలేక ఏకంగా తన సర్వీసుకే రాజీనామా చేస్తున్నట్లు 2001లో శిల్పా నాగ్ ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపింది. అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మైసూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న రోహిణి సింధూరిని బదిలీ చేయాల్సి వచ్చింది. దేవాదాయ శాఖ కమిషనర్‌గా నియమించింది. శిల్పా నాగ్ రాజీనామాను తిరస్కరించింది.

ఎన్నో బదిలీలు..

ఎన్నో బదిలీలు..

2009 బ్యాచ్.. కర్ణాటక కేడర్‌కు చెందిన రోహిణి సింధూరి తెలుగు అధికారిణి. మొదట్లో తుమకూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా, మండ్య జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేశారు. అనంతరం హసన్, మైసూరు జిల్లాల కలెక్టర్‌గా ఉన్నారు. మైసూరులో ఉన్నప్పుడే వివాదాలు చుట్టుముట్టాయి. 2017లో ఆమె హసన్ జిల్లా కలెక్టర్‌గా నియమితులు అయ్యారు. 2018న ఆమెను కేఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా, 2019లో సిల్క్ బోర్డ్ కమిషనర్‌‌గా బదిలీ అయ్యారు. 2020లో మైసూరు జిల్లా కలెక్టర్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఎక్కువ రోజులు అక్కడ కొనసాగలేకపోయారు. ఆ మరుసటి ఏడాది దేవాదాయ శాఖకు బదిలీ అయ్యారు.

ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారిణి

ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారిణి


ఇప్పుడు తాజాగా రోహిణి సింధూరిపై కర్ణాటక క్యాడర్ కే చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి డీ రూప.. తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకంగా 19 రకాల ఆరోపణలతో కూడిన ఓ జాబితాను విడుదల చేశారు. ఎమ్మెల్యే సా.రా. మహేష్‌ తో చర్చల విషయం బహిర్గతం కావడంతో రోహిణి సింధూరిపై ఆరోపణల వర్షం కురిపించారు. రోహిణి సింధూరి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఆరోపణలు చేసిన వ్యక్తితో..

ఆరోపణలు చేసిన వ్యక్తితో..

మైసూరులో సా.రా. మహేష్ భూఆక్రమణకు పాల్పడినట్లు స్వయంగా ఆయనపై ఆరోపణలు చేసిన రోహిణి సింధూరి ఇప్పుడు ఆయనను ఎందుకు కలిశారని ప్రశ్నించారు. అలాంటి నాయకుడిని రోహిణి సింధూరి తోటి ఐఏఎస్ అధికారి మణిమన్నన్ తో వెళ్లి కలిశారని, దీనికి గల కారణాలను వెల్లడించాలని డీ రూప డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే లేదా రాజకీయ నాయకులను ఐఎఎస్ స్థాయి అధికారి కలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

 భారీ ఇంటి నిర్మాణం..

భారీ ఇంటి నిర్మాణం..


బీజేపీకి చెందిన మైసూరు లోక్ సభ సభ్యుడు ప్రతాప సింహాపైనా రోహిణి సింధూరి గతంలో పలు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. బెంగళూరు జాలహళ్లిలో విశాలమైన ఇంటిని రోహిణి సింధూరి కట్టుకున్నారని, స్థిరాస్తి రిటర్న్స్‌లో ఈ ఇంటి ప్రస్తావన లేదని గుర్తు చేశారు. కోట్ల విలువ రూపాయల విలువ చేసే ఇటాలియన్ ఫర్నీచర్, 26 లక్షల రూపాయల విలువ చేసే జర్మన్ ఇంటీరియర్స్ ను దీనికి వినియోగించారని అన్నారు. వీటన్నింటికీ డబ్బలు ఎక్కడివని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+