మోదీ ఎఫెక్ట్, సీన్ లోకి మాజీ ప్రధాని, వెంటనే ఇబ్రహీం ఔట్, కొడుకు కుమార ఇన్, మ్యాటర్ క్లోజ్ !
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మూడు నెలల క్రితం కర్ణాటకలో (Karnataka) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంతకాలం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి (BJP), ప్రతిపక్ష పార్టీ అయిన జేడీఎస్ కు చుక్కలు చూపించిన కాంగ్రెస్ (Congress) పార్టీ ఎవ్వరూ ఊహించన విధంగా భారీ స్థాయిలో ఎమ్మెల్యేలను (MLA) గెలిపించుకుని అధికారంలోకి వచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరం అయిన బీజేపీ, జేడీఎస్ (jds) పార్టీలు కాంగ్రెస్ దెబ్బకు ఇంత వరకు కోలుకోలేదు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ, జేడీఎస్ పార్టీల పొత్తు పెట్టుకోవడంతో రెండు పార్టీలో ఇప్పుడు అసమ్మతి సెగ ఎక్కువ అయ్యింది. బీజేపీతో (BJP)జేడీఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవడంతో ముస్లిం నేత, జేడీఎస్ (JDS) పార్టీ కర్ణాటక (Karnataka) రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

జేడీఎస్ పార్టీలో అసమ్మతి ఎక్కువ కావడంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ (hd deve gowda) అలర్ట్ అయ్యారు. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ (hd deve gowda)ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా కర్ణటక జేడీఎస్ శాఖ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంను పార్టీ నుంచి బహిష్కరించి కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామిని (hd Kumaraswamy) ఎంపిక చేశారు.
గురువారం బెంగళూరు నగరంలోని జేపీ భవన్‌లో జరిగిన జేడీఎస్ పార్టీ కోర్ కమిటీ సమావేశంలో మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ (hd deve gowda) జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలతో చర్చించి మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి (hd Kumaraswamy) కర్ణాటక శాఖ జేడీఎస్ పార్టీరాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

జేడీఎస్ (jds) పార్టీ సీనియర్ నాయకుడు సీఎం ఇబ్రహీంతోపాటు మరికొంత మంది పార్టీ నాయకులు (leader), కార్యకర్తలను పార్టీ నుంచి తొలగించాం. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (hd Kumaraswamy) కర్ణాటక జేడీఎస్ (jds)పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొన్ని కమిటీలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ (hd deve gowda) తెలిపారు. పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా సీఎం ఇబ్రహీం ప్రకటనలను ప్రస్తావించడం వలనే ఆయన్ను పార్టీ పదవి నుంచి తొలగించామని మాజీ ప్రధాని దేవేగౌడ తెలిపారు.

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పని చెయ్యాలని జేడీఎస్ పార్టీ నిర్ణయించింది. ఎవరిని అడిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ?, బీజేపీతో పొత్తును తాను వ్యతిరేకిస్తున్నానని సీఎం ఇబ్రహీం ఇటీవల బహిరంగంగానే మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ (hd deve gowda), మాజీ సీఎం కుమారస్వామికి (hd Kumaraswamy) వ్యతిరేకంగా మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో (delhi)ప్రధాని మోదీ (MODI), అమిత్ షాతో చర్చలు జరిపిన తరువాత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో జేడీఎస్ పొత్తు ఖరారు అయ్యింది.
ఇదే విషయంలో మా పార్టీలో నీ పెత్తనం ఏమిటి అంటూ జేడీఎస్ నాయకుల నుంచి సీఎం ఇబ్రహీంకు ప్రశ్నల వర్షం కురిసింది. భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వంలో మేము భాగస్వాములు కాదు, వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. దీనివల్ల జేడీఎస్ (jds) భావజాలానికి గానీ, నేతలకు గానీ ఎలాంటి ఇబ్బంది లేదు. మా పార్టీలో ముస్లిం నేతలను విస్మరించలేదని మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ అంటున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications