గన్ మెన్ తో షూ తొడిగించుకున్న మంత్రిగారు, చేతులు ఖాళీగా ఉన్నా సరే ?
బెంగళూరు: కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి హెచ్‌సీ మహదేవప్పకు ఆయన అంగరక్షకుడు బూట్లు తొడిగి స్వామి భక్తిని చాటుకున్నారు. కర్ణాటకలోని ధారవాడలోని సప్తాపురలోని సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థుల హాస్టల్‌ను మంత్రి మహదేవప్ప బుధవారం ఆకస్మికంగా తనిఖి చేశారు. హాస్టల్ లో పరిస్థితిని పరిశీలించిన మంత్రి మహదేవప్ప విద్యార్థులకు అందిస్తున్న భోజనాలు. అక్కడి ఏర్పాట్లపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
హాస్టల్‌కు వెళ్లిన మంత్రి మహదేవప్ప చాలాసేపు హాస్టల్ లోని గదులు పరిశీలించారు. అన్నీ పరిశీలించి తరువాత హాస్టల్ లో నుంచి తిరిగి వస్తుండగా మంత్రి మహదేవప్ప ఆయన వదిలన షూల దగ్గర నిలబడి ఉన్నారు. ఆ సమయంలో మంత్రి మహదేవప్ప ఎంతసేటికి షూ వేసుకోకుండా అక్కడే నిలబడి ఉన్నారు. ఆ సమయంలో గన్ మెన్ మంత్రి మహదేవప్పకు షూలు తొడిగి ఆయన స్వామి భక్తిని చాటుకున్నారు.

అయితే గన్ మెన్ షూ తొడుతున్న సమయంలో అక్కడ ఉన్న అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడుతున్న మంత్రి మహదేవప్ప ఆయన గన్ మెన్ ను వద్దని చెప్పకుండా హ్యాపీగా షూలు తొడిగించుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తరువాత కర్ణాటకలో వివిద కులాలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో మంత్రి మహదేవప్ప మాట్లాడారు.
రిజర్వేషన్ల కల్పించే విషయంలో బీజేపీ అన్ని తరగతులకు చెందిన కులాలను నమ్మించి చివరికి చాక్లెట్లు పంచిందని, రిజర్వేషన్లు కల్పించే విషయంలో బీజేపీ ప్రజలను మోసం చేసిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్. సి.మహదేవప్ప తీవ్రంగా ఆరోపించారు. డాక్టర్ సదాశివ కమిషన్ అమలుపై హుబ్లీలో మంత్రి మహదేవప్ప విలేకరులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications