కర్ణాటక ఎన్నికలు: మొరాయించిన ఈవీఎంలు, పలుచోట్ల ఆలస్యంగా పోలింగ్!

Recommended Video

    Karnataka Election 2018 Update

    బెంగళూరు: శనివారం ఉదయం కర్ణాటకలోని 222 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కానీ పోలింగ్ బూత్ ల వద్ద ఈవీఎం మెషీన్లు మొరాయించడంతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు.

    హుబ్లిలోని 108 పోలింగ్ బూత్ వద్ద ఓటు ధ్రువీకరణ మెషీన్ వివిపాట్ ను పునరుద్దరించారు. వివిపాట్ సరిగా పనిచేయకపోవడంతో దాని స్థానంలో మరోదాన్ని తీసుకొచ్చారు. ఈ కారణంగా అక్కడ పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. హుబ్లిలోని లామింగ్టన్ స్కూల్ పోలింగ్ బూత్ వద్ద కూడా ఈవీఎం మొరాయించింది. దీంతో అక్కడ కూడా పోలింగ్ ఆలస్యంగా మొదలైంది.

    ఈవీఎంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా మాజీ ప్రధానమంత్రి హెచ్.డి దేవేగౌడ తన ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఈవీఎం పనిచేయకపోవడంతో మొదట ఆయన ఓటు నమోదు కాలేదు. దీంతో మళ్లీ కాసేపటికి ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    karnataka polling day, reports of faulty machines in several booths

    కల్బుర్గిలోని చించోలిలో ఓ పోలింగ్ బూత్ వద్ద ఈవీఎం మొరాయించడంతో అక్కడ కూడా పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. దీంతో అధికారులు సమస్యను పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు.

    కుందాపూర్ నియోజకవర్గంలోని జన్వర్ కట్టె ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ బూత్ వద్ద ఈవీఎం మొరాయించడంతో రెండు గంటల పాటు పోలింగ్ నిలిచిపోయింది. ఉడుపి జిల్లాలోని ఓ పోలింగ్ బూత్ వద్ద కూడా ఇదే పరిస్థితి.

    బెంగళూరులోని పోలింగ్ బూత్ ల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఓ మహిళా ఓటరు 'ఈ ప్రభుత్వ పాఠశాల వద్దకు 7గం.కే వచ్చాను. కానీ ఈవీఎం పని చేయని కారణంగా చాలాసేపటి నుంచి ఓపిగ్గా ఎదురుచూస్తున్నాం' అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

    బెంగళూరులోని శివాజీనగర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద కూడా ఈవీఎం మొరాయించినట్టు సమాచారం.చిక్ పేటలోని ఆర్వీట టీచర్స్ కాలేజీలో పోలింగ్ బూత్ వద్ద కూడా ఈవీఎం మొరాయించింది.

    ఇక నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి చామరాజపేట్ ప్రాంతంలో విద్యుత్ సమస్య నెలకొంది. దీంతో స్థానిక పోలింగ్ బూత్ వద్ద ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+