పోలీస్ బాస్ 'రాసలీలలు': ఆఫీసులోనే మహిళతో డీజీపీ అశ్లీల చేష్టలు! (వీడియో)
కర్ణాటక పోలీస్ విభాగంలో అత్యున్నత స్థాయి అధికారికి సంబంధించిన ఓ అశ్లీల వీడియో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టిస్తోంది. డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రరావు తన అధికారిక ఛాంబర్‌లో యూనిఫాంలో ఉండగానే ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు బయటకు రావడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
ఘటన వివరాలిలా..
ప్రస్తుతం సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో డైరెక్టర్ జనరల్ (DG)గా విధులు నిర్వహిస్తున్న రామచంద్ర రావుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అధికారిక డ్యూటీ సమయంలో తన ఆఫీస్ ఛాంబర్లోనే ఆయన ఓ మహిళను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటూ అశ్లీల హావభావాలు ప్రదర్శిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. సదరు మహిళలు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు దుస్తుల్లో అధికారి గదికి వచ్చినట్లు వీడియోల ద్వారా తెలుస్తోంది. ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం రహస్యంగా రికార్డ్ చేసినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి ఆగ్రహం
ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నతాధికారుల నుంచి పూర్తి వివరాలను కోరారు. వీడియో చూసిన అనంతరం సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయంలో ఖాకీ యూనిఫాం గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం.
అదంతా ఫేక్.. డీజీపీ కౌంటర్
ఈ ఆరోపణలను డీజీపీ రామచంద్ర రావు తీవ్రంగా ఖండించారు.తనను వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. వైరల్ అవుతున్న వీడియో 'మార్ఫింగ్ చేసినదని, అది నకిలీదని ఆయన స్పష్టం చేశారు. కాగా, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న రాన్యా రావు తండ్రే ఈ రామచంద్ర రావు కావడంతో ఈ వివాదం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Another Scandal rocks Karnataka.
— Deepak Bopanna (@dpkBopanna) January 19, 2026
Alleged sleaze videos of the state's Top Cop DGP Ramachandra Rao have gone viral.
IPS officer Ramachandra Rao is the step father of actress Ranya Rao who was arrested for smuggling gold into India.
Following the leak the officer has alleged… pic.twitter.com/HF3v9shrlr
విచారణకు ఆదేశం
ప్రస్తుతం ప్రభుత్వం ఈ వీడియో వాస్తవికతను తేల్చేందుకు ఫోరెన్సిక్ దర్యాప్తుకు ఆదేశించే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి అధికారి ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం పోలీస్ శాఖ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని సామాజిక వర్గాల్లో విమర్శలు వస్తున్నాయి.
-
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications