సిట్టింగ్ సీఎం మీద ఆ లీడర్ పోటీ ?, హత్య కేసు నిందితుడు, సుప్రీం కోర్టు బహిష్కరించిన వ్యక్తితో ?

బెంగళూరు/ధారవాడ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారిపోయాయి. ఎప్పుడు ఎవరు ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారు ?, ఎవరి మీద ఎవరు బరిలోకి దిగుతారు అనే విషయం చాలా నియోజక వర్గాల్లో అంతు చిక్కడం లేదు. కర్ణాటక సిట్టింగ్ సీఎం మీద ఓ హత్య కేసులో నగర బహిష్కరణకు గురైన మాజీ మంత్రి పోటీ చేస్తారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

కర్ణాటకలోని హావేరి జిల్లాలోని శింగ్లావి నియోజక వర్గం నుంచి పోటీ చేసిన బసవరాజ్ బోమ్మయ్ కర్ణాటక సీఎం అయ్యారు. మరోసారి శింగ్లావి నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని సీఎం బసవరాజ్ బోమ్మయ్ డిసైడ్ అయ్యారని తెలిసింది. అయితే 2008 నుంచి బసవరాజ్ బోమ్మయ్ చేతిలో వరుసగా ఓడిపోతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజ్జం పీర్ ఖాద్రి ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దంగా లేరని తెలిసింది.

Karnataka: The opposition party leaders are contesting the accused in the murder case against the sitting CM Basavaraj Bommai.

కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీద కర్ణాటక మాజీ మంత్రి వినయ్ కులకర్ణిని పోటీలో దింపాలని కాంగ్రెస్ పార్టీ లీడర్స్ దాదాపుగా డిసైడ్ అయ్యారని తెలిసింది. మాజీ మంత్రి వినయ్ కులకర్ణి సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీద పోటీ చేస్తే తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని సీఎం బోమ్మయ్ చిరకాల ప్రత్యర్థి అజ్జం పీర్ ఖాద్రి కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్యకు హామీ ఇచ్చారని తెలిసింది.

ధారవాడ గ్రామీణ నియోజక వర్గం నుంచి పోటీ చేసి మంత్రి అయిన వినయ్ కులకర్ణి జిల్లా పంచాయితీ సభ్యుడి హత్య కేసులో అరెస్టు అయ్యి జైలుపాలై తరువాత బెయిల్ మీద బయటకు వచ్చాడు, ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. ధారవాడలో అడుగుపెట్టకూడదని సుప్రీం కోర్టు మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో వినయ్ కులకర్ణి ప్రస్తుతం ధారవాడ జిల్లాలో అడుగుపెట్టడానికి అవకాశం లేకుండాపోయింది.

ధారవాడలో అడుగుపెట్టకుండా వినయ్ కులకర్ణి గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవు. బసవరాజ్ బోమ్మయ్ పోటీ చేస్తున్న శింగ్లావి నియోజక వర్గంలో ముస్లీంలు, పంచమశాలి కులస్తుల ఓట్లుఎక్కువగా ఉన్నాయి. వినయ్ కులకర్ణిని అక్కడి నుంచి పోటీ చేయిస్తే సీఎం బసవరాజ్ బోమ్మయ్ అంత సులభంగా విజయం సాధించలేరని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే హత్య కేసులో నగర బహిష్కరణకు గురైన మాజీ మంత్రి వినయ్ కులకర్ణిని సిట్టింగ్ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీద పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ ధైర్యం చెయ్యడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+