తమిళనాడు సీఎం మీద తిరుగుబాటు: ఎమ్మెల్యేకి సినిమా కష్టాలు, కోటి నగదు, ఆస్తులు సీజ్ !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చేసి టీటీవీ దినకరన్ వర్గంలో చేరిన ఆ రాష్ట్ర మాజీ మంత్రి, అనర్హత ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ పీకల్లోతుల్లో చిక్కుకుపోయాడు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చేసి టీటీవీ దినకరన్ వర్గంలో చేరిన ఆ రాష్ట్ర మాజీ మంత్రి, అనర్హత ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ పీకల్లోతుల్లో చిక్కుకుపోయాడు. మూడో రోజూ సెంథిల్ బాలాజీ ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.

సెంథిల్ బాలాజీ బంధువులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేసిన ఐటీ శాఖ అధికారులు భారీ మొత్తంలో నగదు, విలువైన ప్రతాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. కరూరు జిల్లాలోని సెంథిల్ బాలాజీ ఇంటితో పాటు రామకృష్ణపురం, సెంగుందపురం, రాజేశ్వరపట్టి, వాంగల్ తదితర 22 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు.

Karur IT raid continues as 3rd day former minister Senthi Balaji

సెంథిల్ బాలాజీ బంధువులు, సన్నిహితులు అయిన త్యాగరాజన్, స్వామినాథన్, సెల్వరాజ్, మనోహర్, హోటల్ అధినేత సుబ్రమణియన్, ఫైనాన్స్ సంస్థ అధినేత నవరంగ్ సుబ్రమణియన్, ఎంసీ. శంకర్, ఆనంద్ తదితరుల నివాసాలు, కార్యాలాయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు.

ఆదాయుపన్ను శాఖ అధికారులు మూడు ప్రాంతాల్లో సోదాలు పూర్తి చేశారు. మిగిలిన 19 ప్రాంతాల్లో శనివారం సోదాలు చేస్తున్నారు. ఆదాయపన్ను శాఖ అధికారుల దాడుల్లో ఒక కోటి రూపాయలకు పైగా నగదు, కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు బయటపడ్డాయని ప్రాచారం జరుగుతోంది. అధాయపన్ను శాఖ అధికారులు ఈ విషయాన్ని ధ్రవీకరించవలసి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+