Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైష్ణోదేవి కాలేజీలో ముస్లిం అడ్మిషన్ల రగడ..! రిజర్వేషన్ లేదన్న సీఎం..!

జమ్మూకశ్మీర్ లోని శ్రీ వైష్ణోదేవి మెడికల్ కాలేజీలో ఈ ఏడాది కేటాయించిన 50 ఎంబీబీఎస్ సీట్లకు గానూ 42 మంది ముస్లింలకే అడ్మిషన్లు ఇవ్వడంపై బీజేపీ సహా హిందూ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. వైష్ణోదేవి ఆలయానికి వచ్చే నిధులతో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ కాలేజీలో ముస్లింలకు మెజార్టీ అడ్మిషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి. మెడికల్ కాలేజీ అడ్మిషన్లను సమీక్షించకపోతే నిరసనలు తప్పవని హిందూ సంస్థలు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలో సీఎం ఒమర్ అబ్దుల్లా ఇవాళ ఘాటుగా స్పందించారు. శ్రీ మాతా వైష్ణో దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్‌లో అడ్మిషన్లపై వివాదంపై జమ్మూ ,కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ..శ్రీ మాతా వైష్ణో దేవి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి అసెంబ్లీ బిల్లును ఆమోదించినప్పుడు, ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన బాలురు, బాలికలను దాని నుండి దూరంగా ఉంచుతామని ఎక్కడ రాసిపెట్టారని ఆయన బీజేపీని ప్రశ్నించారు.

Kashmir College Admissions Row CM Says No Reservation Despite Muslim Majority Claims

విశ్వవిద్యాలయంలో ప్రవేశం మతం ఆధారంగా కాకుండా, మెరిట్ ఆధారంగా మాత్రమే జరుగుతుందని చట్టంలో ఉందని గుర్తుచేశారు. మెరిట్ లేకుండా అడ్మిషన్లు ఇవ్వాలనుకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. లౌకికవాదం' అనే పదం రాజ్యాంగంలో భాగంగా ఉందని, మీరు ఈ దేశాన్ని లౌకికంగా ఉంచకూడదనుకుంటే, ఈ పదాన్ని రాజ్యాంగం నుండి తొలగించాలని బీజేపీకి ఒమర్ సూచించారు. బిజెపికి చెందిన సునీల్ శర్మ మెరిట్ ఆధారంగా అడ్మిషన్ గురించి ప్రస్తావించే సంబంధిత అసెంబ్లీ చట్టాన్ని అధ్యయనం చేయాలని ఆయన కోరారు. మెరిట్ ఆధారంగా అడ్మిషన్ పొందిన అభ్యర్థుల తప్పు ఏమిటన్నారు. అప్పుడు వారు ముస్లింలకు శ్రీ మాతా వైష్ణో దేవి ఆసుపత్రిలో చికిత్స అందదని కూడా స్పష్టంగా చెప్పాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+