రైల్వే ప్యాసింజర్లకు గుడ్ న్యూస్

భారతీయ రైల్వే 16 జూన్ 2024న కవచ్ 4.0 నూతన వెర్షన్‌ను ఆమోదించి రెండు నెలల వ్యవధిలో కోట నుండి మరియు సవాయి మాధోపూర్ మధ్య 108 కిమీ పరిధిలో 26 సెప్టెంబర్ 2024 తేదీన ఈ వ్యవస్థకు సంబందించిన అన్నీ పనులను పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావడం జరిగినది. రైల్వే మంత్రిత్వ శాఖ అదే విభాగంలో కవచ్ 4.0 కు సంబందించిన 7 రకాల పరీక్షలను నిర్వహించింది.తదనుగుణంగా 10,000 కోమోటివ్‌లలో కవచ్ నూతన వెర్షన్ 4.0 ని ఏర్పాటు చేయడానికి భారతీయ రైల్వే ఇప్పుడు ఆమోదం తెలిపింది.

కవచ్ వెర్షన్ 4.0 అనే రక్షణ వ్యవస్థ భారతీయ రైల్వే చరిత్రలో ఒక ప్రధాన మైలురాయి, అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్ దేశంలోని విస్తారమైన రైల్వే నెట్‌వర్క్‌లో రైలు కార్యకలాపాల భద్రతను మరింత మెరుగుపరుస్తుంది. ఈ వ్యవస్థ రాబోయే కొన్ని సంవత్సరాలలో మొత్తం రైల్ నెట్ వర్క్ లో ప్రధాన రక్షణ వ్యవస్థ గా ఏర్పడి పూర్తి రక్షణకు సహాయపడుతుంది.దక్షిణ మధ్య రైల్వేలో నేటి వరకు కవచ్ 1,465 రూట్ కిమీలు మరియు 144 లోకోమోటివ్‌లలో ఏర్పాటుచేయబడింది. ఢిల్లీ-ముంబై మరియు ఢిల్లీ-హౌరా (సుమారు 3,000 రూట్ కిలోమీటర్లు) వంటి అధిక సాంద్రత గల మార్గాలలో కవచ్ విస్తరణ ప్రారంభమైంది.

Kavach train protection system has been installed in railways

కవచ్ విస్తరణ రెండు దశల్లో చేపట్టబడుతుంది. మొదటి దశలోభాగంగా: కవచ్ రాబోయే నాలుగు సంవత్సరాలలో అన్ని లోకోమోటివ్‌లలో మరియు కొన్ని బ్లాక్ సెక్షన్ లో ఆర్.ఎఫ్.ఐ.డి. సదుపాయం ద్వారా ఏర్పాటు చేయబడుతుంది. రెండవ దశలో భాగంగా: రైల్వే స్టేషన్ మరియు యార్డ్లలో కవచ్ పరికరాలను అమర్చడం ద్వారా పూర్తిగా మన్నికలోకి రావడం జరుగుతోంది.

భారతీయ రైల్వేలు రైలు కార్యకలాపాల నిర్వహణలో భద్రతకు అంత్యంత ప్రధాన్యతనిస్తూ నిరంతరం చర్యలు తీసుకుంటోంది. 2012-14 సంవత్సరాలలో రోజుకు సగటున 2.6 ప్రమాదాలు సంభవించగా, 2022-24 సంవత్సరాలలో కేవలం 0.5 (అంటే 2 రోజుల్లో 1 ప్రమాదాలు)కు తగ్గాయి.కవచ్ అత్యంత సాంకేతికతతో కూడిన వ్యవస్థ మరియు ఈ వ్యవస్థలో ఈ క్రింది వివిధ విభాగాలు ప్రధాన అంశాలుగా ఉంటాయి. .

లోకోలో ఏర్పాటుచేసిన కవచ్ నుండి సమాచారాన్ని అందుకుని , సిగ్నలింగ్ వ్యవస్థ మరియు లోకోమోటివ్‌కు మార్గనిర్దేశం చేస్తుంది. రైలు యొక్క గమనం మరియు దిశను గుర్తించడానికి ట్రాక్‌లపై ప్రతి 1 కిమీ మరియు ప్రతి సిగ్నల్ వద్ద ఏర్పాటు చేయబడింది. ట్రాక్ వెంట ఏర్పాటుచేయబడిన టవర్లు & ఓ.ఎఫ్.సి ద్వారా లోకో & స్టేషన్ మధ్య సమాచార మార్పిడికి అనుకులవంతమైనది. ఆర్.ఎఫ్.ఐ.డి ట్యాగ్‌లను రీడ్ చేస్తూ బ్రేకింగ్ సిస్టమ్‌తో అనుసంధానించబడి, స్టేషన్ కవచ్‌తో కమ్యూనికేట్ చేస్తుంది మరియు డ్రైవర్ తన విధి నిర్వహణలో విఫలమైతే ఆటోమేటిక్ బ్రేకింగ్‌ను వర్తింపజేస్తుంది. క్యాబ్‌లో సిగ్నల్ అంశం, రైలు గమనానికి సంబందించిన అధికారం మరియు నిర్దేశించిన వేగపరిమితికి సంబందించిన మొదలగు అంశాల ఏర్పాటు. స్టేషన్ కవచ్ - సిగ్నలింగ్‌ ఇన్‌పుట్‌లు & లోకో ఇన్‌పుట్‌లు మరియు కదలిక అధికారాన్ని లోకో కవచ్‌కి బదిలీ చేస్తుంది. లోకోలతో కమ్యూనికేషన్ కోసం మరియు ఆర్.ఎఫ్.ఐ.డి ట్యాగ్‌లు ద్వారా రైలు గమనాన్ని గుర్తించడం.

కవచ్ - ముఖ్యమైన లక్షణాలు
లోకో పైలట్ విధి నిర్వహణలో విఫలమైతే బ్రేక్‌ల స్వయంచాలక అప్లికేషన్.
డ్రైవర్ క్యాబ్‌లో లైన్-సైడ్ సిగ్నల్‌ని ప్రదర్శిస్తుంది.
రేడియో ఆధారిత ప్రత్యేక్ష గమన పర్యవేక్షణ.
ఎల్. సి. గేట్ల వద్ద మానవ ప్రమేయం లేకుండా శబ్ద సూచనలు.
లోకో నుండి లోకో కు ప్రత్యక్ష సమాచార మార్పిడి ద్వారా ఎదురు ఎదురుగా రైళ్లు ఢీకొనకుండా నివారించడం.
ఏదైనా ప్రమాదం జరిగితే ఎస్. ఓ. ఎస్. సందేశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+