కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
కావ్య మారన్. సన్ రైజర్స్ టీం యజమాని. ఐపీఎల్ ప్రస్తుత సీజన్ తో దుమ్ము లేపుతున్న టీం ను వెనుక ఉండి నడిపిస్తున్న మహిళ. గ్రౌండ్‌లో ఆమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వికెట్ తీస్తే ఆమె చేసే సందడి.. ప్రత్యర్ధి బ్యాటర్లు సిక్సర్లు కొడితే.. ఆమె ఇచ్చే హావభావాలు ప్రత్యేకం. సన్ రైజర్స్ ను మాత్రమే కాదు..వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి కావ్య మారన్ ఒక్కరే వారసురాలు. కావ్య మారన్ ఆస్తి విలువ లెక్కలు.. కావ్య కార్ల కోసం చేసిన ఖర్చు వివరాలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి.
కావ్య ఆస్తుల లెక్కలు
సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. ఈ 31 ఏళ్ల చిన్నది చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. అలాగే యూకే నుంచి ఎంబీఏలో పట్టా సాధించింది. 92 ఏప్రిల్ 6న చెన్నైలో పుట్టిన కావ్య రూ.33 వేల కోట్ల సన్ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి ఒక్కరే వారసురాలు. కావ్య మారన్ వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.417 కోట్లు. ఆమె తల్లి కావేరీ మారన్ సోలార్ టీవీ కమ్యూనిటీ లిమిటెడ్ సీఈవో గా పనిచేస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరిగా నిలిచింది. డీఎంకే పార్టీలో కావ్య కుటుంబం కీలకంగా వ్యవహరిస్తోంది.

ఐపీఎల్ లో స్పెషల్ అట్రాక్షన్
కానీ, కావ్య మాత్రం పూర్తిగా వ్యాపార విస్తరణకే సమయం కేటాయిస్తున్నారు.కావ్య తండ్రి కళానిధి మారన్ సన్ గ్రూపు వ్యవస్థాపకులు. కావ్య సన్ రైజర్స్ బాధ్యతలు తీసుకున్న తరువాత మంచి గుర్తింపు పొందారు. సన్ రైజర్స్ టీం ఆటగాళ్లను కొనుగోలు సమయంలో కొందిర కోసం కావ్య ఆక్షన్ లో వ్యవహరించిన తీరు పలు సందర్బాల్లో విమర్శలకు కారణమైంది. కానీ, గ్రౌండ్ లో కావ్య అంచనాల లెక్కలు ఏంటో అభిమానులకు అర్దమైంది. జట్టు గెలిచినప్పుడు పట్టలేని సంతోషం వ్యక్తం చేసే కావ్య.. ఓడిపోయినప్పుడు దిగులుగా కనిపిస్తుంది. సన్‌రైజర్స్ ప్యాట్ కమిన్స్ సారధ్యంలో ఎదురులేని శక్తిగా దూసుకుపోతోంది.
కార్లు అంటే మోజు
కావ్య కార్ల కలెక్షన్లకు ప్రత్యేకత ఉంది. కావ్యకు కార్లు అంటే మోజు ఎక్కువ. కావ్య వద్ద ఉన్న రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB ధర రూ. 12.2 కోట్లు. కాగా,. బెంట్లీ బెంటెగా LWB - ధర: రూ. 6 కోట్లుతో కొనుగోలు చేసారు. అదే విధంగా.. బీఎండబ్ల్యూ i7- ధర రూ. 2.13 కోట్లు తో సొంతం చేసుకున్నారు. ఫెరారీ రోమా - ధర రూ. 3.76 కోట్లుతో కొనుగోలు చేసారు. ఐపీఎల్ ఆక్షన్ లోనూ తాను అనుకున్న ఆటగాడి కోసం వేలంలో ఎంతకైనా కావ్య వెనుకాడరు. ప్రస్తుత సీజన్ లో సన్ రైజర్స్ దూసుకు పోతోంది. సన్ రైజర్స్ ఆడుతుంటే అక్కడ కావ్య ఉండాల్సిందే. ఇప్పుడు కావ్య ఆస్తులు, కార్ల ధరలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications