మహిళల రక్షణ కోసం ఇంట్లో కత్తులు సిద్ధం చేసుకోండి: ప్రమోద్ ముతాలిక్
బెంగళూరు: హిందూ మహిళల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో తల్వార్లు(కత్తులు) సిద్ధంగా పెట్టుకోవాలని శ్రీరామ సేన జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ వ్యాఖ్యానించారు. గురువారం యాడ్రావి పట్టణంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరిగిన హిందూ మహా సభలో ఆయన ప్రసంగించారు.
తమ ఇంటి వద్దకు వచ్చేవారికి ఖడ్గం స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. కత్తులు ఇంట్లో ఉంటే పోలీసులు కేసు నమోదు చేయరని.. ఆయుధం ప్రదర్శించడం ఎవరినీ చంపేందుకు కాదని, కేవలం మహిళల రక్షణ కోసమేనని ప్రమోద్ ముతాలిక్ స్పష్టం చేశారు.

ఆయుధ పూజ సమయంలో ట్రాక్టర్, పుస్తకాలు, పెన్నులకు బదులుగా మనం తల్వార్లకు పూజలు చేయాలని ఆయన సూచించారు. పోలీసులు ఆయుధాలకు పూజ చేస్తే కేసు నమోదు చేయరు.. ఎందుకంటే వారు కూడా పోలీస్ స్టేషన్లలో తుపాకులకు పూజ చేస్తారు. అందుకే మనం మన ఇళ్లల్లో కత్తులను ఎందుకు పూజించ కూడదు? అని వ్యాఖ్యానించారు.
ఇటీవల హిందూ మహిళలే లక్ష్యంగా దాడులు జరుగుతున్న క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన వ్యాఖ్యలపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications