corona lockdown: ప్రేమజంట విరహ వేదన, లేచిపోయిన కపుల్, మేజిస్ట్రేట్ ఓకే.. కానీ ఈ సమయంలో..
ప్రేమికుల పాలిట కూడా కరోనా వైరస్ శాపంగా మారుతోంది. ఒక్కటైన ప్రేమ పక్షులు విరహ వేదన భరించలేకపోతున్నారు. ఎలాగూ ప్రేమించుకున్నాం.. పెద్దలు ఒప్పుకోవడం లేదని అనుకున్నారు. కానీ కరోనా లాక్‌డౌన్ ఉందని మరచిపోయారు. ఇంట్లో నుంచి లేచిపోతే.. పోలీసులు పట్టుకున్నారు. కానీ ఇద్దరు మేజర్లు అవడంతో కోర్టు కూడా ఓకే చెప్పింది. కానీ ఆ షరతు విధించడంతో ప్రేమికుల పాలిట శాపంగా మారింది.

లేచిపోయిన జంట
కేరళలోని తమరాస్సేరికి చెందిన జంట.. ప్రేమలో మునిగిపోయారు. వీరిద్దరూ మతాలు వేరు కానీ మనసులు ఒక్కటయ్యాయి. తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పడంతో అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ చర్చించుకొని.. శనివారం ఇంటి నుంచి పారిపోయారు. కానీ విషయం తెలియని అమ్మాయి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. వెంటనే గాలింపు చేపట్టగా.. ఆ మరునాడే జంట పోలీసు స్టేసన్‌కు వచ్చింది. వెంటనే వారిని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రెట్ ఎదుటహాజరుపరిచారు.

లేచిపోయేందుకు ఓకే.. కానీ...
జడ్జీ ఎదురుగా తన సమ్మతంతోనే వెళ్లానని యువతి పేర్కొన్నది. వాళ్లిద్దరూ మేజర్లు కావడంతో మేజిస్ట్రేట్ కూడా అభ్యంతరం తెలుపలేదు. దీంతో జంట ఊపిరి పీల్చుకున్నారు. కానీ మేజిస్ట్రేట్ ఒక షరతు విధించారు. ఆ జంట నిబంధనలను ఏమైనా అతిక్రమించారా అని అడిగారు. లాక్‌డౌన్ ఉన్న సమయంలో పారిపోయారని పోలీసులు తెలిపారు. దీంతో జంట షాక్‌నకు గురైంది.

లాక్‌డౌన్
లాన్ డౌన్ సమయంలో ఆస్పత్రికి, మెడికల్ షాపుకు వెళ్లేందుకు మాత్రం అనుమతి ఉందని.. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసందుకు కూడా పర్మిష్ ఉంది అని పోలీసులు చెప్పారు. కానీ ఆ జంట ఏకంగా లేచిపోయారని పేర్కొన్నారు. ఇది అత్యవసరం కాదని తెలిపారు. ఐపీసీ 188 సెక్షన్ ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

యథేచ్చగా..
కేరళలో ప్రేమ జంట కాదు.. చాలామంది లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో వైరస్ వ్యాపిస్తోంది. కేరళలో 336 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 263 మంది చికత్స పొందుతుండగా.. 71 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు చనిపోయారని కేరళ అధికారులు పేర్కొన్నారు.
Recommended Video
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications