మేకతోను సెక్స్.. : నిర్దారించిన పోలీసులు, కేరళ రేప్ నిందితుడిపై మరో కేసు
కోచి : పైత్యం ముదిరితే పైశాచికానికి దారి తీస్తుందన్నట్టు.. విపరీతమైన సెక్స్ పోకడలు ఎంత నీచానికి దిగజారుతాయో చెప్పడానికి దీన్ని మించిన ఉదాహరణ లేదు. కేరళలోని పెరుంబవూరులో సంచలనం రేపిన దళిత మహిళ అత్యాచార ఘటనలో అరెస్టయిన నిందితుడు అమీరుల్ ఇస్లాం నుంచి నివ్వెరపోయే విషయాలు రాబడుతున్నారు పోలీసులు.
దళిత మహిళ జిషా 30 పై అత్యాచారం హత్య కేసులో అరెస్టయిన నిందితుడు అమీరుల్ ఇస్లాంపై తాజాగా మరో కేసు నమోదైంది. మేకతో అసహజ సెక్స్ లో పాల్గొన్నందుకు గాను అతనిపై తాజా కేసు నమోదైనట్టు సమాచారం. పోలీసుల తాజా విచారణలో భాగంగా.. నిందితుడు అమీర్ ఇస్లాం పశువులతోను తాను సెక్స్ కార్యకలాపాలు కొనసాగించిన విషయాన్ని వెల్లడించినట్టుగా తెలుస్తోంది.

పెరంబవూరులోని ఓ లాడ్జి పక్కన కట్టేసి ఉన్న ఓ మేకతో నిందితుడు అసహజ సెక్స్ కు పాల్పడినట్టు పోలీసులు నిర్దారించారు. విచారణలో భాగంగా నిందితుడు అమీర్ ఇస్లాం వెల్లడించిన ఈ విషయాలపై పోలీసులు ఆరా తీయగా, అమీర్ ఇస్లాం సెక్స్ కు యత్నించిన మేక గాయపడినట్టుగా పోలీసులు గుర్తించారు.
అనంతరం లాడ్జి యజమాని ఫిర్యాదు మేరకు మేకతో అసహజ సెక్స్ కు యత్నించినందుకు గాను అతనిపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే, అసోం నుంచి వలస కార్మికుడిగా కేరళకు వచ్చిన అమీర్ ఓ దళిత మహిళపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడడంతో గత నెలలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
అయితే దళిత మహిళను హత్య చేసిన క్రమంలోనే.. అతను బస చేసిన పెరంబవూరు లాడ్జి పక్కన ఉన్న ఓ మేకపై నిందితుడు అసహజ సెక్స్ కి పాల్పడ్డాడు. పోలీస్ విచారణలో భాగంగా తేలిన అంశాలను ప్రస్తావిస్తూ అతన్ని కోర్టులో హాజరుపరుచగా కోర్టు జూలౌ 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.












Click it and Unblock the Notifications