బిచ్చగాడి మూడో పెళ్లికి అడ్డుకట్ట: హైకోర్టు సంచలన తీర్పు

ముస్లిం మతంలో బహుభార్యత్వంపై కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ ముస్లిం వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవచ్చని.. కానీ ఆ వ్యక్తి తన భార్యలందరికీ న్యాయం చేయగలగాలి, పోషించగలిగే సామర్థ్యం ఉండాలని కోర్టు స్పష్ణం చేసింది. ఈ కేసులో న్యాయమూర్తి జస్టిస్ పీవీ కున్హికృష్ణన్, కేవలం బిక్షాటనే చేస్తూ జీవించే ఓ దివ్యాంగుడిని మూడో వివాహం చేసుకోకుండా నిలువరించాలని, అందుకు అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వాలని సామాజిక సంక్షేమ శాఖను ఆదేశించారు.

భార్య భరణం కేసు
కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన ఓ అంధుడు భిక్షాటన ద్వారా నెలకు సుమారు రూ.25,000 సంపాదిస్తున్నాడని.. అతని నుంచి భరణం ఇప్పించాలని రెండో భార్య కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే భిక్షాటన చేసే వ్యక్తికి భరణం ఇవ్వమని ఆదేశించలేమని న్యాయస్థానం ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త విడాకులు ఇస్తానని బెదిరిస్తున్నాడని, మూడో పెళ్లికి సిద్ధమవుతున్నాడని ఆమె కోర్టుకు తెలిపింది.

Kerala High Court s Landmark Ruling Beggar s Third Marriage Halted Polygamy Clarified

కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ క్రమంలో భరణం ఇవ్వలేమన్న ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని కేరళ హైకోర్టు సమర్థించింది. ఆదాయం లేని వ్యక్తి భరణం చెల్లించలేడని పేర్కొంది. అలాగే ఆ మహిళ, అతనికి అప్పటికే మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుందని గుర్తు చేసింది. ఒక వ్యక్తి తన భార్యలను పోషించలేని పక్షంలో అతనికి మరో పెళ్లి చేసుకునే హక్కు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఖురాన్ ప్రకారం, ఒక వ్యక్తికి బహుభార్యత్వానికి అనుమతి ఉన్నప్పటికీ, అది ఒక నియమం కాదు, కేవలం మినహాయింపు మాత్రమే అని న్యాయస్థానం పేర్కొంది. ఖురాన్ ఏకపత్నీవ్రతాన్ని ప్రోత్సహిస్తుందని, ఒక వ్యక్తి తన భార్యలందరికీ న్యాయం చేయగలిగితేనే బహుభార్యత్వం అనుమతించబడుతుందని న్యాయమూర్తి వివరించారు.

చాలామంది ముస్లింలు ఖురాన్ స్ఫూర్తికి అనుగుణంగా ఏకపత్నీవ్రతాన్ని పాటిస్తున్నారని, కానీ విద్య లేనివారు ఈ చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇటువంటి ఆచారాలకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించాలని మత పెద్దలు, సమాజాన్ని కోర్టు కోరింది. భిక్షాటనను జీవనోపాధిగా అంగీకరించలేమని, ప్రజలు అలాంటి పరిస్థితులకు నెట్టబడకుండా నిలువరించాల్సిన బాధ్యత సమాజం, ప్రభుత్వం, న్యాయవ్యవస్థపై ఉందని కోర్టు స్పష్టం చేసింది. బహుభార్యత్వం వల్ల నిరాశ్రయులైన మహిళలను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+