వంతులవారీగా నలుగురు కూతుళ్లపై రేప్.. తాగుబోతు తండ్రి అఘాయిత్యం.. అనూహ్యంగా బటయటపడ్డ దారుణం..
కనీవినీ ఎరుగని దారుణమిది. మద్యానికి బానిసైన ఓ తండ్రి కీచకుడిలా మారాడు. చిన్నపిల్లలని చూడకుండా కన్న కూతుళ్లపై కన్నేశాడు. నలుగురు బిడ్డలపై వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని నెలలపాటు వాళ్లకు నరకం చూపించాడు. బయటికి చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించాడు. మిగతా ముగ్గురు బిడ్డలూ మౌనంగా ఉండిపోయినా.. 10ఏళ్ల చిన్నారి మాత్రం బాధ తట్టుకోలేక దారుణాన్ని బయటపెట్టింది.

రోజూ తాగొచ్చి..
అక్షరాస్యత నుంచి అభివృద్ధి దాకా అన్ని రంగాల్లో ముందుండే కేరళలో ఈ దారుణం వెలుగుచూసింది. మలప్పురం జిల్లా వలంచెరి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 47 ఏళ్ల వ్యక్తి వలంచెరి శివారులో కుటుంబంతోపాటు నివసిస్తున్నాడు. దినసరి కూలీగా పనిచేస్తోన్న అతనికి నలుగురు కూతుళ్లున్నారు. చాలాకాలం కిందటే మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి భార్యాపిల్లల్ని కొట్టేవాడు. అంతటితో ఆగకుండా కూతుళ్లపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

నలుగురు బిడ్డలూ మైనర్లే..
తాగుబోతు తండ్రి చేతులో నలిగిపోయిన నలుగురు బిడ్డలూ మైనర్లే. పెద్దమ్మాయి వయసు 17 ఏళ్లుకాగా, రెండోపాపకు 15, మూడో పాపకు 13, చిన్నకూతురికి 10 ఏళ్లు. ఇంట్లో అంత నరకం అనుభవిస్తూనే ఆ నలుగురు పిల్లలు చదువులు కొనసాగిస్తున్నారు. తాగి ఇంటికొచ్చే తండ్రి.. రోజుకొకరు చొప్పున వంతులవారీగా కూతుళ్ళను అనుభవించేవాడు. కొన్ని నెలలపాటు ఈ వ్యవహారం కొనసాగింది.

చిన్నారి ఏడుపుతో..
రోజురోజుకూ తండ్రి పెడుతోన్న బాధలు తీవ్రతరం కావడంతో 10 ఏళ్ల చిన్నకూతురు తట్టుకోలేకపోయింది. ఓ రోజు నీరసంగా ఉన్న పాపను క్లాస్ టీచర్ దగ్గరికి తీసుకుని ఏం జరిగిందని ఆరాతీయగా.. గట్టిగా ఏడుస్తూ అంతా చెప్పేసింది. వెంటనే అలర్టయిన ఆ టీచర్.. అదే స్కూల్లో చదువుతోన్న మిగతా ముగ్గురు అక్కాచెల్లెళ్లను పిలిపించి మాట్లాడింది. తాగుబోతు తండ్రి తమపై తరచూ అత్యాచారం చేస్తున్న విషయాన్ని నలుగురు పిల్లలూ వెల్లడించారు.

వైద్యపరీక్షలు..
షాక్ కు గురైన స్కూల్ టీచర్.. ప్రిన్సిపల్ తో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ముందుగా కీచక తండ్రిని అదుపులోకి తీసుకుని.. నలుగురు పాపల్ని వైద్యపరీక్షలకు పంపారు. నలురుగు బాధితులపైనా కొంతకాలంగా అత్యాచారం జరుగుతున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటనలో నిందితుడిపై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసులు నమోదుచేశామని వలంచెరి పోలీసులు వివరించారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications