తండ్రి మూర్ఖత్వం: బిడ్డ ప్రాణం తీసింది(వీడియో)

కోజికోడ్‌: ఓ తండ్రి మూర్ఖత్వంతో ప్రవర్తించిన తీరు అప్పుడే పుట్టిన బిడ్డ ప్రాణం తీసింది. ప్రాణానికి ప్రమాదమని వైద్యులు, పోలీసులు ఎంత వారించినా వినిపించుకోలేదు ఆ మూర్ఖుడు. ఫలితంగా కన్న బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. బుధవారం కేరళలోని కోజికోడ్‌కు చెందిన అబు బక్ర్‌ భార్య స్థానిక ఆస్పత్రిలో చిన్నారికి జన్మనిచ్చింది. అయితే, పుట్టిన కొంతసేపటి తర్వాత నుంచి చిన్నారికి తల్లిపాలను అందించాల్సి ఉంటుంది.

Kerala Muslim man forbids wife from breastfeeding newborn, cites religious reasons

అయితే 24 గంటల వరకు ఎటువంటి ఆహారం ఇవ్వొద్దని అబుబక్ర్‌ వైద్యులకు అడ్డుతగిలాడు. రెండు గంటలకొకసారి చిన్నారికి ఆహారం అందించాల్సి ఉంటుందని వైద్యుడు సాజి సీకే వివరించినా అతడు వినిపించుకోలేదు.

లేదంటే పుట్టిన బిడ్డకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పినా లెక్కచేయకుండా భార్యాబిడ్డతో సహా రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. ఆస్పత్రి నుంచి వెళ్లిన గంటల సమయంలోనే పుట్టిన బిడ్డ ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయింది.

బిడ్డ మృతితో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. కాగా, తండ్రి ప్రవర్తనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో ఆ తండ్రి తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ దంపతులను విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+