కేరళ నన్ అత్యాచారం కేసు: బిషప్ ఫ్రాంకో ములక్కల్ రాజీనామాకు వాటికన్ సిటీ ఆమోదం
కేరళ: కేరళ నన్ పై అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను బాధ్యతల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు వాటికన్ సిటీలోని కాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 16న తనను తాత్కాలికంగా బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా ఫ్రాంకో ములక్కల్ వాటికన్‌కు లేఖ రాశారు. తను జలంధర్ నుంచి కేరళకు తరుచూ ప్రయాణం చేయాల్సి ఉన్నందున తనను తప్పించాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను భారత్‌లోని పోప్ ప్రతినిధికి అందజేశారు.
2014 నుంచి 2016 మధ్య కేరళకు చెందిన నన్ పై ములక్కల్ పలుమార్లు లైంగిక దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా నన్ ఫిర్యాదు చేసింది. బుధవారం రోజున పోలీసుల విచారణలో భాగంగా ములక్కల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. విచారణ ముగిశాక పోలీస్ స్టేషన్ బయటకు ఆయన రాగానే చేదు అనుభవం ఎదురైంది. ఆలిండియా యూత్ ఫెడరేషన్, సీపీఐ యూత్ వింగ్‌కు చెందిన కార్యకర్తలు నల్లజెండాలను ఎగురవేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

ములక్కల్ దిష్టిబొమ్మను కూడా కొందరు తగులబెట్టారు. ఇదిలా ఉంటే గురువారం రోజు ములక్కల్ విచారణ ఒక కొలిక్కి వచ్చే అవకాశముందన్నారు కొట్టాయం ఎస్పీ హరిశంకర్.మరోవైపు విచారణ సందర్భంగా ములక్కల్ కేరళకు చేరుకోవడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. మరోవైపు తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికిస్తున్నారని.. తనకు ఏపాపం తెలియదని బుకాయించారు. అత్యాచారం అనే పేరు పెట్టి తనపై కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు ములక్కల్.












Click it and Unblock the Notifications