బస్సులు.. బార్బర్ షాపులు: సడలించిన తొలి 2 గంటలోనే రూల్స్ బ్రేక్: తిక్క కుదర్చిన కేంద్రం
తిరువనంతపురం: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి రెండోదశలో ప్రకటించిన 19 రోజుల లాక్‌డౌన్ సడలింపులు అమల్లోకి వచ్చిన తొలి రెండు గంటల్లోనే కేరళలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేశారా? అనే భావన ఏర్పడేలా కనిపించింది అక్కడి వాతావరణం. లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందు ఎలాంటి వాతావరణం ఉండేదో.. సడలింపు తరువాత అవే పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి నివేదికను అందజేయాలని ఆదేశించింది.
లాక్‌డౌన్ సడలింపులు ఆరంభమైన వెంటనే జనం రోడ్ల మీదికి వచ్చారు. బస్సు సర్వీసులూ ఆరంభం అయ్యాయి. 30 కిలోమీటర్ల దూరం వరకు రాకపోకలు సాగించేలా ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు తిరుగాడాయి. మాంసం విక్రయల దుకాణలు తెరచుకున్నాయి. బార్బర్ షాపులు జనంతో క్రిక్కిరిసిపోయి ఉండటం కనిపించింది. పాఠశాలలు, విద్యాసంస్థలకు మినహాయింపు ఇవ్వనప్పటికీ దాని అనుబంధంగా కొనసాగే దుకాణాలన్నీ తెరచుకున్నాయి. జిరాక్స్ సెంటర్లు, బుక్ స్టోర్లు యథాప్రకారం ఓపెన్ అయ్యాయి.

కేరళలో నెలకొన్న తాజా పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. కేరళ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ చట్టం నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీనిపై కేరళ ప్రభుత్వానికి లేఖ రాసింది. పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ భల్లా ఆదేశించారు. ఈ మేరకు ఆయన కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆయన తెలిపారు.

దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తోన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము జారీ చేసిన నిబంధనలను ఉల్లఘించవద్దంటూ అజయ్ భల్లా ఇదివరకే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. నిబంధనలను ఉల్లంఘించిన రాష్ట్రాల్లో సడలింపును ఉపసంహరిస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ కేరళలో అసాధారణ పరిస్థితులు నెలకొనడం పట్ల కేంద్రం అసంతృప్తిని వ్యక్తం చేసింది. తదుపరి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Recommended Video
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications