నటికి ఫంక్షన్లో వేధింపులు: శ్వేతామీనన్ స్టేట్‌మెంట్ రికార్డ్

కొల్లం నుండి ఆదివారం పోలీసు టీం కొచ్చికి వచ్చింది. టీంలో మహిళా సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఉన్నారు. వీరు ఉదయం తొమ్మిది గంటలకు శ్వేత ఇంటికి వచ్చి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. రిపోర్టును బహిర్గతపర్చేందుకు పోలీసులు నిరాకరించారు.
సమాచారం మేరకు శ్వేతా మీనన్... ఇద్దరి పేర్లను చెప్పినట్లుగా తెలుస్తోంది. అందులో ఎంపి కురుప్ పేరు ఉంది. నిందితుల పైన చర్యలు తీసుకోవడానికి ముదు తాము కేసును పూర్తిస్థాయిలో విచారిస్తామని పోలీసులు తెలిపారు.
శనివారం రాత్రి శ్వేతా మీనన్ విలేకరులతో మాట్లాడారు. సినీ వర్గాలతో మాట్లాడిన అనంతరం తాను ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని మంగళవారం కలిసి దీనిపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాగా, శ్వేతా మీనన్ స్టేట్‌మెంటును పోలీసులు డివైఎఫ్ఐ ఫిర్యాదు మేరకు రికార్డ్ చేశారు.












Click it and Unblock the Notifications