విధ్యార్థిని తల్లిని చేసిన ఫాస్టర్, పారిపోతూ పట్టుబడ్డాడిలా...

ఓ విధ్యార్థినిపై అత్యాచారం చేసి బిడ్డకు జన్మనిచ్చేందుకు కారణమైన ఫాస్టర్ ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కన్నూర్ సమీపంలోని కేలకం పోలీసులు ఫాస్టర్ రాబిన్ ను అరెస్టు చేశారు.

కన్నూర్:ఓ విధ్యార్థినిపై అత్యాచారం చేసిన ఆరోపణలపై కేరళలోని ఓ చర్చి పాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఫాస్టర్ రాబిన్ పై ఫోస్కో చట్టంతో పాటు ఐపిసి376 కింద కేసులు నమోదుచేశారు.

కేరళలోని కన్నూరులో విధ్యార్థిని తల్లి చేశారనే ఆరోపణలతో ఫాస్టర్ రాబిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విధ్యార్థిని గత వారం క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 25వ, తేదిన చైల్డ్ లైన్ కు ఓ వ్యక్తి నుండి లేఖ వచ్చింది.

ఈ లేఖలోని సమాచారం ఆధారంగా కేలకం పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు పోలీసులు. బాధితురాలిని మహిళా పోలీస్ అధికారి కలిసి ఆమె నుండి వాంగ్మూలం తీసుకొన్నారు. తొలుత తన స్వంత తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఆ విధ్యార్థిని చెప్పింది.

Kerala Priest Arrested For Allegedly Raping Student

కానీ, ఆమె తల్లిదండ్రులను ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడు చర్చి ఫాస్టర్ అని తేలిందని పోలీసులు చెబుతున్నారు.

ఆమె చదువుతున్న పాఠశాలకు మేనేజర్ గా ఈ ఫాస్టర్ వ్యవహరిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు చెప్పారని పోలీసులు చెబుతున్నారు.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారంగా గత ఏడాది మే మాసంలో ఈ ఘటన చోటుచేసుకొంది. అయితే ఓ గుర్తు తెలియని వ్యక్తి లేఖ రాయడంతో ఈ వ్యవహరం వెలుగుచూసింది.

అయితే ఈ విషయం తెలిసి ఫాస్టర్ రాబిన్ పారిపోయాడు.అయితే పెరపూర్ సిఐ సునీల్ కుమార్ కేలకం ఎస్ ఐ ప్రదీప్ నేతృత్వంలోని టీమ్ ఫాస్టర్ రాబిన్ ను అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+