viral video: బస్సు నుంచి కింద పడిపోతుండగా వృద్ధుడిని కాపాడిన క్లీనర్..
కేరళలోని కన్నూరులో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వృద్ధుడు ప్రైవేట్ బస్సు ఎక్కుతుండగా అదుపుతప్పి కిందకు పడబోయాడు. అంతలోనే దేవుడిలా వచ్చిన ఆ బస్సు క్లీనర్ చాకచక్యంగా వృద్ధుడిని కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆపదలో దేవుడిలా వచ్చి ఆ వృద్ధుడిని కాపాడిన క్లీనర్ పై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆ క్లీనర్ చూపిన మానవత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
A True Saviour!
— Karnataka Portfolio (@karnatakaportf) August 29, 2026
A bus cleaner became a guardian angel for an elderly passenger who nearly fell while boarding the bus.
With quick reflexes and presence of mind, Atul Kuku, the cleaner of the Parvathi bus operating on the Kuttiattoor–Kannur route, immediately stepped in and… pic.twitter.com/PtnMcIguWJ
కేరళలోని కుట్టియట్టూరు- కన్నూర్ మార్గంలో ప్రయాణిస్తున్న బస్సులో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు ఓ స్టేజీ వద్ద ఆగగానే ఓ వృద్ధుడు బస్సు ఎక్కాడు. అయితే ఆ వృద్ధుడు ఎక్కేలోపే డ్రైవర్ బస్సును వేగంగా ముందుకు పోనిచ్చాడు. దాంతో ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయిన వృద్ధుడు కిందపడిపోయాడు. వెంటనే బస్సులో ఉన్న అతుల్ అనే క్లీనర్ సమయస్ఫూర్తితో స్పందించి ఆ వృద్ధుడు కింద పడకుండా కాపాడాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బస్సులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మరోవైపు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే సరైన టైమ్ లో స్పందించి వృద్ధుడిని కాపాడటంతో అతుల్ పై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

క్లీనర్ క్షణం ఆలస్యం చేసినా ఆ వృద్ధుడు బస్సు కింద పడిపోయేవాడు. సమయానికి స్పందించి వృద్ధుడిని కాపాడడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్లీనర్ దేవుడి రూపంలో సాయం చేశాడుగా.. అంటూ కామెంట్ పెడుతున్నారు. అలాగే మరి కొందరు మాత్రం బస్సు ఎక్కే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అంటూ.. ఇంకొందరు మాత్రం రకరకాల ఈమోజీలతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పటివరకూ 1200 కు పైగా లైక్ లు, లక్షకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.












Click it and Unblock the Notifications