Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇక పెట్రోల్ బంకుల్లో కిరోసిన్ అమ్మకాలు- గెజిట్ జారీ

ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో వంటగ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దేశంలోని వివిధ నగరాల్లో వంటగ్యాస్ కొరత తీవ్రమైంది. డొమెస్టిక్, కమర్షియల్ అనే తేడా ఏదీ ఉండట్లేదు. అన్ని వర్గాల వారి మీదా దీని ప్రభావం పడింది. హోటళ్ల యజమానులు ఏకంగా సెలవులను ఇచ్చుకునే పరిస్థితి తలెత్తిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి తలెత్తింది. వంట వండటానికి ఇతర వనరులపై ఆధారపడాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం భద్రత, లైసెన్సింగ్ నిబంధనలను సడలించింది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో కిరోసిన్ పంపిణీని అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సడలింపులు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఇవి 60 రోజులు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటాయి.

Kerosene Supply Relief Retailers Authorized to Distribute for Households Across 21 States

దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులన్నీ కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఆధీనంలో ఉంటాయి. కిరోసన్ అమ్మకాలకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరి. ఎల్పీజీ కొరత నేపథ్యంలో ఆ శాఖ అధికారులు పెట్రోల్ బంకుల్లో కిరోసిన్ అమ్మకాలకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అనుమతులు ఇచ్చాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసే సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ ను ఇక్కడ విక్రయిస్తారు.

గతంలో కిరోసిన్ సరఫరా నిలిపివేసిన ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌తో సహా మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో కిరోసిన్ ను విక్రయిస్తారు. గృహావసరాల వినియోగాల కోసమే దీన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఈ పెట్రోల్ బంకుల్లో కిరోసిన్ ను స్టోర్ చేయడానికి కూడా అనుమతులు లభించాయి. సవరించిన నిబంధనల ప్రకారం ఒక్కో డీలర్‌షిప్‌కు గరిష్టంగా 5,000 లీటర్ల కిరోసిన్‌ను నిల్వ చేయడానికి అనుమతి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలు ఒక్కో జిల్లాలో గరిష్ఠంగా రెండు సర్వీస్ స్టేషన్‌లను గుర్తించాల్సి ఉంటుంది. కిరోసిన్ సరఫరా, నిల్వను వేగవంతం చేయడానికి 2002 నాటి పెట్రోలియం నిబంధనల నుండి కొన్ని మినహాయింపులు డీలర్లకు లభించాయి. ఇంధన కొరత అధికంగా ఉన్న ప్రాంతాల్లో గల పెట్రోల్ బంకుల్లో తొలిదశలో కిరోసిన్ ను పంపిణీ చేస్తారు. అనంతరం దీన్ని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+