కేజీఎఫ్ హీరో బహిరంగ లేఖ, ఫ్యాన్స్ కోసం ఏం చెప్పాడంటే ?, విదేశాల్లోనే అన్ని అంటున్నాడు !
కన్నడ హీరో, రాకింగ్ స్టార్, కేజీఎఫ్ ఫేమ్ యశ్ పుట్టినరోజు వేడుకలకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే అభిమానులు వాళ్ల స్టార్ హీరో యశ్ బర్త్ డే వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 తరువాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్ టాక్సిక్ సినిమా మొదలుపెట్టారు. యశ్ బర్త్ డే రోజు టాక్సిక్ ఫస్ట్‌లుక్, టీజర్ విడుదలవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఈ మేరకు యశ్ తన అభిమానులకు ఓ బహిరంగ లేఖ రాశారు. యశ్ లేఖ చూసిన అభిమానులు ఖంగుతిన్నారు. జనవరి 8వ తేదీన నాతో వ్యక్తిగతంగా కలవాలని అనుకునే వాళ్లు, నాపై ఉన్న ప్రేమను చూపించాలని అనుకునే వాళ్లకు తాను అందుబాటులో ఉండటం లేదని యశ్ లేఖలో వివరించాడు. నేనూ నా పుట్టినరోజు మీతో గడపాలని చాలా అనుకున్నానని, అయితే సాధ్యం కావడం లేదని యశ్ వివరించాడు.

సినిమా పనుల కోసం తాను విదేశాల్లో చాలా బిజీగా ఉన్నానని, అనివార్య కారణాల వలన తాను ప్రయాణంలో ఉంటానని, ఈ జనవరి 8వ తేదీన నేను మిమ్మల్ని కలవలేకపోతున్నానని, కానీ మీప్రేమాభిమానాలు తన మీద ఎప్పటిలాగే ఉండాలని ఆశిస్తున్నానని, తనను అభిమానులు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నానని, మీరు ఎప్పుడూ నాతోనే ఉంటారని ఆశఫడుతున్నానని యశ్ లేఖలో వివరించాడు.
కేజీఎఫ్ హీరో యశ్ గత నాలుగు సంవత్సరాలుగా తన పుట్టినరోజును అభిమానుల సమక్షంలో జరుపుకోలేదు. గతేడాది కూడా ఇలాంటి లేఖ రాసిన కన్నడ హీరో యశ్ ఆయన అభిమానుల నిరాశపరిచాడు. మీ ముందు నిలబడటానికి నాకు మరికొంత సమయం ఇవ్వండి, మీకు మరింత జోష్ పెంచడానికి నేను చాలా శ్రద్ధగా పనిచేస్తున్నానని, త్వరలో మనం అందరూ కలుద్దామని యశ్ ఆయన అభిమానులను ఉద్దేశించి రాసిన లేఖను విడుదల చేశాడు.
నెల రోజుల క్రితమే యశ్ అతని 19వ సినిమాను ప్రకటించాడు. కేజీఎఫ్ ఫేమ్ యశ్ తదుపరి సినిమాకు టాక్సిక్ అని పెట్టనున్నారు. టైటిల్ ఎనౌన్స్ మెంట్ రోజునే విడుదల అయిన టీజర్ అదిరిపోయిందని ఆయన అభిమానులు అంటున్నారు. టాక్సిక్ అనే ఆసక్తికర టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో యశ్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో కలిసి యష్ టాక్సిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సుమారు రూ. 170 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రొడక్షన్, ప్రమోషన్, రిలీజ్ ప్లాన్ ప్రపంచ స్థాయిలో జరుగునుందని సమాచారం. 2019లో, కోవిడ్‌కు ముందు హీరో యశ్ అతని పుట్టినరోజును బెంగళూరు నగరంలోని నంది లింక్స్ మైదానంలో ఘనంగా జరుపుకున్నారు. అభిమానులు తమ అభిమాన నటుడు యశ్ పుట్టినరోజు వేడుకల కోసం 215 అడుగుల ఎత్తైన కటౌట్‌ను ఏర్పాటు చేసి 5, 000 కిలోల కేక్‌ను తీసుకువచ్చి యశ్ తో కట్ చేయించారు.
ఆ రోజు వేలాది మంది అభిమానులు తమ అభిమాన నటుడు యశ్ ను చూసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత కరోనా కారణంగా మూడు ఏళ్ల పాటు యశ్ అతని పుట్టినరోజు వేడుకలను బహిరంగంగా జరుపుకోలేదు. గత సంవత్సరం తన 19 సినిమాని ఇంకా ప్రకటించలేనందుకు, మిమ్మల్ని నేరుగా కలవలేకపోయానని యశ్ అతని అభిమానులకు ఓ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పాడు. అనంతరం కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిన యశ్ అక్కడే పుట్టినరోజు జరుపుకున్నాడు
ఈ ఏడాది కూడా టాక్సిక్ సినిమాతో బిజీగా ఉండటం వల్ల మిమ్మల్ని కలవలేకపోతున్నాను అని హీరో యశ్ చెప్పాడు. తాజాగా యష్ తన స్నేహితులతో కలిసి విమానం ముందు నిలబడి ఉన్న ఫోటో వైరల్‌గా మారింది. యశ్ ఇప్పటికే విదేశాలకు వెళ్లాడు. అదే కారణంతో తన పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని కలవలేకపోతున్నానని అభిమానులకు లేఖ ద్వారా సమాచారం అందించాడు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications