Khiladi: భర్తకు రూ. 3 కోట్లు ఇన్సూరెన్స్, ఆంటీ ఏం చేసిందంటే, బంధువుతో, కారులో, దేవుడా !
చెన్నై/కోయంబత్తూరు: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ భార్య ఎవ్వరూ ఊహించని పని చేసింది. రియల్ ఎస్టేట్, పవర్ లూమ్స్ వ్యాపారం లో భర్తకు నష్టాలు వచ్చాయి. వ్యాపారం కోసం భర్త రూ. 1 కోటి అప్పు చేశాడు. మంచిమంచి వ్యాపారాలు చేసిన భర్త రూ. 3 కోట్లకు ఇన్సూరెన్స్ చేశాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు భర్త మీద ఒత్తిడి చెయ్యడంతో భార్య రగిలిపోయింది. తన భర్తను చంపేస్తే రూ. 3 కోట్లు ఇన్సూరెన్స్ వస్తుందని, అప్పులు తీర్చేసి రూ. 2 కోట్లతో ఎంజాయ్ చెయ్యోచ్చని ప్లాన్ వేసిన ఆంటీ బంధువుతో కలిసి భర్తను కారులో పెట్టి పెట్రోల్ పోసి సజీవదహనం చెయ్యడం కలకలం రేపింది.

రియల్ ఎస్టేట్, పవర్ లూమ్స్ వ్యాపారం
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా పెరండురైకి చెందిన రంగరాజన్ (62) అనే ఆయన పవర్ లూమ్స్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల వ్యాపారంలో నష్టాలు రావడంతో మళ్లీ వ్యాపారంలో పుంజుకోవడానికి తెలిసిన వాళ్ల దగ్గర కోటి రూపాయల వరకు అప్పు చేశాడు. అయినా వ్యాపారం పుంజుకోకపోవడంతో రంగరాజన్ అయోమయంలో పడిపోయాడు.

రూ. 3 కోట్లు ఇన్సూరెన్స్
రంగరాజన్ బాగా డబ్బులు సంపాధించే సమయంలో రూ. 3 కోట్లకు ఇన్సూరెన్స్ చేశాడు. నామినిగా రంగరాజన్ ఆయన భార్య జ్యోతిమణి (54) పేరు పెట్టాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావని రంగరాజన్ వేధింపులకు గురి చేశారు. తన భర్త అప్పులు చేసిన తన తలమీదకు తెచ్చిపెడుతున్నాడని ఆంటీ జ్యోతిమణి భర్తను సూటిపోటిమాటలతో వేధింపులకు గురి చేసింది.

ఆసుపత్రిలో భర్త... స్కెచ్ వేసిన ఆంటీ
ఇటీవల రోడ్డు ప్రమాదంలో రంగరాజన్ కాలు విరిగింది. కోయంబత్తూరులోని ఓ ఆసుపత్రిలో రంగరాజన్ ను చేర్పించి చికిత్స చేయించారు. తన భర్త చేసిన అప్పులు పూర్తిగా తీరిపోవాలంటే ఆయన్ను చంపేయాలని, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే రూ. 1 కోటితో అప్పులు తీర్చేసి మిగిలిన రూ. 2 కోట్లతో మనం జల్సా చెయ్యడానికి అవకాశం ఉంటుందని ఆంటీ జ్యోతిమణి అతని సమీప బంధువు రాజా (41) అనే వ్యక్తికి చెప్పింది. రాజాతో కలిసి జ్యోతిమణి భర్త హత్యకు స్కెచ్ వేసింది.

ఆంటీ డ్రామాలు... నమ్మేసిన భర్త
శుక్రవారం జ్యోతిమణి ఆంటీ, ఆమె బంధువు రాజా కోయంబత్తూరులోని ఆసుపత్రికి వెళ్లి భర్త రంగరాజన్ ను డిశ్చార్జి చెయ్యాలని డాక్టర్లకు చెప్పారు. తరువాత ఓమిని కారులో రంగరాజన్ ను పిలుచుకుని సొంత ఊరికి బయలుదేరారు. కోయంబత్తూరు సమీపంలోని పెరుమనల్లూరు సమీపంలో కారులో పొగలు వస్తున్నాయని, మేము వెళ్లి చూసి వస్తామని రంగరాజన్ కు చెప్పి కారులో నుంచి బయటకు వచ్చారు.

ఆంటీ కిరాతకురాలు, భర్త సజీవదహనం
కారులో ప్రాణాలో ఉన్న భర్త రంగరాజన్ మీద, కారు మీద పెట్రోల్ పోసిన భార్య జ్యోతిమణి ఆంటీ, రాజా కలిసి నిప్పంటించి అతన్ని సజీవదహనం చేశారు. కారు ప్రమాదంలో తన భర్త రంగరాజన్ సజీవదహనం అయ్యాడని జ్యోతిమణి పోలీసులకు చెప్పింది. ఇదే సమయంలో జ్యోతిమణి ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది.

గంటకు ఓ మాట మార్చారు
పోలీసులు మొదట జ్యోతిమణి మాటలు నమ్మారు. ఇదే సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులు వచ్చి ఇది రూ. 3 కోట్ల వ్యవహారం అని, మాకు మీ ఎఫ్ఐఆర్ కీలకం అయ్యిందని పోలీసులకు చెప్పారు. పోలీసుల విచారణలో జ్యోతిమణి ఆంటీ, ఆమె బంధువు రాజా గంటకు ఒకమాట మాట్లాడటంతో పోలీసులకు అనేక అనుమానాలు వచ్చాయి.

నా మొగుడే చెప్పాడు సార్
నన్ను చంపేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని, ఆ డబ్బుతో అప్పులు తీర్చాలని, మీరు నన్ను వెంటనే చంపేయాలని తన భర్త రంగరాజన్ చెప్పాడని, అందుకే కారుకు నిప్పంటించామని జ్యోతిమణి చెప్పింది. మహిళా పోలీసులు జ్యోతిమణి ఆంటీకి ట్రీట్ మెంట్ ఇవ్వడంతో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తానే తన భర్త రంగరాజన్ ను సజీవదహనం చేశానని జ్యోతిమణి అంగీకరించింది. రంగరాజన్ ను సజీవదహనం చేసిన జ్యోతిమణి, ఆమె బంధువు రాజాను పోలీసులు అరెస్టు చేశారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కట్టుకున్న భర్తను జ్యోతిమణి సజీవదహనం చెయ్యడం తమిళనాడులో కలకం రేపింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications