Khiladi: బెడ్ రూమ్ లో సైలెంట్ గా ఉంటున్న భర్త, ఫోన్ చూసి భార్య షాక్, మొబైల్ యాప్ లో ?, కాలాంతకుడి కథ !
చెన్నై/ టీనగర్: పరస్పర అంగీకారంతో యువతి, యువకుడు వివాహం చేసుకున్నారు. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. వ్యాపారం చేస్తున్న భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. మొదట వారంలో రెండు మూడు రోజులు బయట తిరుగుతున్న భర్త రానురాను నెలలో 20 రోజులు బయట గడిపేస్తున్నాడు. నువ్వు ఎందుకు ఎక్కువగా బయట తిరుగుతున్నావు ? అంటూ భార్య ఆమె భర్తను నిలదీసింది. ఇంట్లో భార్య మీద ఆవేశంతో ఊగిపోయిన భర్త ఆమెను చితకబాదేశాడు. పనిలో పనిగా భర్త అతని మొబైల్ ఫోన్ ఇంట్లోనే నేలకు వేసి పగలగొట్టి వెళ్లిపోయి నెల రోజుల పాటు కనపడకుండా పోయాడు. భార్య ఆమె భర్త మొబైల్ ఫోన్ రిపేర్ చేయించి దానిని పరిశీలించింది. భర్త మొబైల్ ఫోన్ లోని వీడియోలు చూసి, ఆడియో క్లిప్పింగ్ లు విన్న భార్య షాక్ కు గురై భర్త అసలు మ్యాటర్ తెలుసుకుని పోలీస్ స్టేషన్ కు పరుగు తీసింది.

దంపతుల హ్యాపీలైఫ్
చెన్నై సిటీ సమీపంలోని షెకుంద్ర ప్రాంతంలో శ్రీధర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 2019లో శ్రీధర్, వైదీశ్వరి అనే యువతి పరస్పర అంగీకారంతో యువతి, యువకుడు వివాహం చేసుకున్నారు. సంతోషంగా కాపురం చేసిన శ్రీధర్, వైదీశ్వరి దంపతులకు రెండు సంవత్సరాల వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు.

వ్యాపారం చేస్తున్న భర్త
వ్యాపారం చేస్తున్న శ్రీధర్ ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. శ్రీధర్ బయట తిరుగుతూ అతని భార్య వైదీశ్వరి, కుమారుడికి ఏలోటు రాకుండా చూసుకుంటున్నాడు. మొదట వారంలో రెండు మూడు రోజులు బయట తిరుగుతున్న శ్రీధర్ రానురాను నెలలో 20 రోజులు బయట గడిపేస్తున్నాడు. గత సంవత్సరం నుంచి శ్రీధర్ తిరగడం ఎక్కువ అయ్యింది.

బెడ్ రూమ్ లో సైలెంట్ గా ఉంటే భార్యకు అనుమానం వచ్చింది
శ్రీధర్ ఎక్కువగా బయట తిరుగుతుంటే అతని భార్య వైదీశ్వరికి అనుమానం వచ్చింది. నువ్వు ఎందుకు ఎక్కువగా బయట తిరుగి కాలం గడుపుతున్నావు ? అంటూ అతని భార్య వైదీశ్వరి భర్త శ్రీధర్ ను నిలదీసింది. కొంతకాలం ఇదే విషయంలో శ్రీధర్, వైదీశ్వరి దంపతుల మద్య గొడలు జరుగుతున్నాయి.

ఫోన్ పగలగొట్టి వెళ్లిపోయిన భర్త
ఒ రోజు రాత్రి ఇదే విషయంలో పంచాయితీ జరిగింది. ఇంట్లో భార్య వైదీశ్వరి మీద ఆవేశంతో ఊగిపోయిన శ్రీధర్ ఆమెను చితకబాదేశాడు. పనిలో పనిగా శ్రీధర్ అతని మొబైల్ ఫోన్ ఇంట్లోనే నేలకు వేసి పగలగొట్టి వెళ్లిపోయి నెల రోజుల పాటు కనపడకుండా పోయాడు. వైదీశ్వరి ఆమె భర్త శ్రీధర్ మొబైల్ షాపు ఫోన్ రిపేర్ చేయించింది.

కాలేజ్ అమ్మాయిలతో లింక్
భర్త శ్రీధర్ మొబైల్ ఫోన్ పరిశీలించిన వైదీశ్వరి షాక్ అయ్యింది. మొబైల్ యాప్ లో కాలేజ్ అమ్మాయిలు, హిజ్రాలకు వల వేసి వారితో శారీరక సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న వైదీశ్వరి హడలిపోయింది. ఇంటర్ చదువుతున్న కాలేజ్ అమ్మాయిని లేపుకుపోయిన శ్రీధర్ వివాహం చేసుకుని చెన్నైలోని మరో ప్రాంతంలో కాపురం పెట్టాడని వైదీశ్వరి తెలుసుకుంది.

నా భర్త పక్కా 420.... మీరే కాపాడండి
భర్త శ్రీధర్ మొబైల్ ఫోన్ లో వేరే అమ్మాయిలు, హిజ్రాలతో శారీరక సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేసిన వీడియోలు చూసింది. భర్త ఎప్పుడు పడితే అప్పుడు పరాయి మహిళలతో మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్ లు విన్న వైదీశ్వరి షాక్ కు గురై ఆమె భర్త శ్రీధర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భర్త మీద కేసు పెట్టిన భార్య
నా భర్త శ్రీధర్ పలువురు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని అతని భార్య వైదీశ్వరి కేసు పెట్టిందని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. భర్త శ్రీధర్ మీద కేసు పెట్టిన వైదీశ్వరి అమాయకులైన కాలేజ్ అమ్మాయిలు ఆమె భర్త బారినపడి మోసపోకుండా చెయ్యడానికి ప్రయత్నించడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications