Khiladi: హైప్రోఫైల్ స్కెచ్, 5 ఏళ్లలో 75 మంది మహిళలతో పెళ్లి, 200 మందిని, ఎంత పోటుగాడు అంటే !
భోపాల్: ఒక పెళ్లి చేసుకోవడమే ఇప్పుడు చాలా మందికి కష్టంగా మారింది. పెళ్లి కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడా ?, సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడా ?, వ్యాపారం చేస్తున్నాడా ? అంటూ అనేక ప్రశ్నలు వేస్తుంటారు. అయితే వీడు ఒకరి తరువాత ఒకరిని ఏకంగా 75 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. అంత మందిని పెళ్లి చేసుకున్న ఆ పొటుగాడు వారితో కొన్ని రోజుల మాత్రమే కాపురం చేశాడు. తరువాత ప్రముఖ నగరంలోని బ్యూటీపార్లలో అందంగా తయారు చేయించి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎాలా నడుచుకోవాలి, స్టైల్ గా బట్టలు వేసుకుని ఎలా ఉండాలి అంటూ ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. వాడు అనుకున్న టార్గెట్ పూర్తి చేసుకున్న తరువాత ఒకరి తరువాత ఒకరిని మొత్తం 75 మంది భార్యలతో పాటు ఇప్పటి వరకు 200 మంది యువతులు, మహిళలను హైప్రోఫైల్ హోదా ఉన్న పోటుగాళ్లు ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లి వస్తున్న హైటెక్ వేశ్యవాటిక కేంద్రాల నిర్వహకులకు అమ్మేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు. ఓ వేశ్యవాటిలో ఇతను పెళ్లి చేసుకున్న 12 మంది మహిళలు పోలీసులకు చిక్కడం కిరాతకుడి వ్యవహారం మొత్తం బయటకు రావడం కలకలం రేపింది.

పోటుగాడు మునీర్
బంగ్లాదేశ్ లో మునీర్ అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. తరువాత భారత్ లోకి అక్రమంగా రావడం, తరువాత బంగ్లాదేశ్ కు వెళ్లడం. ఇదే పనిగా పెట్టుకున్న మునీర్ మాయలోడిగా అవతారం ఎత్తాడు. మహిళలను పెట్టుబడిగా పెట్టుకున్న మునీర్ విచ్చలవిడిగా జల్సాలు చేస్తున్నాడు. అమాయకులైన మహిళలను మునీర్ టార్గెట్ చేసుకున్నాడు.

మునీర్ ను గుడ్డిగా నమ్మేశారు
ప్రస్తుతం ఎవరైనా ఒక పెళ్లి చేసుకోవడమే ఇప్పుడు చాలా మందికి కష్టంగా మారింది. పెళ్లి కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడా ?, సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడా ?, వ్యాపారం చేస్తున్నాడా ? అంటూ అనేక ప్రశ్నలు వేస్తుంటారు. అయితే బంగ్లాదేశ్ కు చెందిన మునీర్ కు ఇలాంటి వర్తింపులు అన్ని దూరం అని వెలుగు చూసింది.

ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం
బంగ్లాదేశ్ కు చెందిన అమాయకులైన మహిళలను టార్గెట్ చేసుకున్న మునీర్ వారికి భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. తరువాత అందంగా ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకోవడం మొదలు పెట్టాడు. వివాహం చేసుకున్న తరువాత మునీర్ వెంట అతని భార్యలు ఎక్కడికంటే అక్కడికి రావడం మొదలు పెట్టారు.

5 సంవత్సరాల్లో 75 మందిని పెళ్లి చేసుకున్న పోటుగాడు
మునీర్ గత ఐదు సంవత్సరాల్లో ఒకరి తరువాత ఒకరిని ఏకంగా 75 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. అంత మందిని పెళ్లి చేసుకున్న పొటుగాడు మునీర్ వారితో కొన్ని రోజుల మాత్రమే కాపురం చేశాడు. తరువాత అక్రమ మార్గంలో బంగ్లాదేశ్ నుంచి వారిని పశ్చిమ బెంగాల్ లోకి పిలుచుకుని వచ్చేశాడు.

భార్యలను అమ్మేసి ముందు శిక్షణ ఇప్పించాడు
పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తా నగరంలోని బ్యూటీపార్లలో అందంగా తయారు చేయించి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎాలా నడుచుకోవాలి, స్టైల్ గా బట్టలు వేసుకుని ఎలా ఉండాలి అంటూ మునీర్ అతను పెళ్లి చేసుకున్న అమ్మాయిలు, మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. వాడు అనుకున్న టార్గెట్ పూర్తి చేసుకున్న మునీర్ తరువాత ఒకరి తరువాత ఒకరిని పెళ్లి చేసుకున్న భార్యలను అమ్మేయాలని స్కెచ్ వేశాడు.

హై ప్రోఫైల్ టార్గెట్ వేశ్యవాటికలు
మునీర్ అతను పెళ్లి చేసుకున్న మహిళలను హైప్రోఫైల్ హోదా ఉన్న యువకులు, అంకుల్స్ ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లి వస్తున్న హైటెక్ వేశ్యవాటిక కేంద్రాల నిర్వహకులకు అమ్మేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు. అమ్మాయి అందాన్ని వెలకట్టి వేశ్యవాటిక కేంద్రాల్లో విక్రయిస్తున్న మునీర్ తరువాత మళ్లీ బంగ్లాదేశ్ వెళ్లి పెళ్లి చేసుకోవడం మొదలు పెట్టాడు.

11 నెలల క్రితం 21 మంది మహిళలు
11 నెలల క్రితం ఇండోర్ పోలీసులు విజయనగర్ ఏరియాలోని ఓ వేశ్యవాటిక కేంద్రం మీద దాడి చెయ్యడంతో అక్కడ ఏకంగా 21 మంది బంగ్లాదేశ్ మహిళలు పట్టుబడ్డారు. అందులో 12 మంది మనీర్ ను పెళ్లి చేసుకున్న వారే ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. మునీర్ ను పట్టించిన వారికి నగదు బహుమానం ఇస్తామని అప్పట్లో పోలీసులు ప్రకటించారు.

అడ్డంగా చిక్కిపోయిన పోటుగాడు
బంగ్లాదేశ్ మహిళను వివాహం చేసుకున్న మునీర్ ఆమెను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సూరత్ పోలీసులకు చిక్కిపోయాడు. కిలాడీ మునీర్ ఇప్పటి వరకు 75 మందిని వివాహం చేసుకుని అందర్ని వేశ్యవాటిక కేంద్రాల్లో అమ్మేశాడని పోలీసుల విచారణలో అంగీకరించాడు. మునీర్ అతను పెళ్లి చేసుకున్న 75 మందితో పాటు ఇప్పటి వరకు 200 మంది మహిళలను వేశ్యవాటిక కేంద్రాల్లో విక్రయించడానికి పోలీసుల విచారణలో అంగీకరించడం కలకలం రేపింది. మునీర్ సెక్స్ రాకెట్ దందా విషయం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కిరాతకుడు మునీర్ బంగ్లాదేశ్ కు చెందిన అనేక మంది అమ్మాయిలను ముంబాయిలో కూడా అమ్మేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ మహిళలను అక్రమంగా పశ్చిమ బెంగాల్ లోకి తరలించడానికి మునీర్ కు చాలా మంది సహకరించి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మునీర్ ను విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications