Khiladi lady: భర్తతో కలిసి ట్యాక్సీ డ్రైవర్ ను చంపిన భార్య, డౌట్ రాకుండా విషం ఇంజెక్షన్, క్లోజ్ !
చెన్నై/ కోయంబత్తూరు: సొంతంగా కారు పెట్టుకుని అద్దెకు తిప్పుతున్న వ్యక్తి డబ్బులు సంపాధిస్తున్నాడు. ఎవరైనా తెలిసిన వాళ్లు కారు అద్దెకు కావాలంటే ఇతను కారు తీసుకుని వెలుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ట్యాక్సీ డ్రైవర్ తాను చెన్నైకి వెలుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లాడు. రెండు రోజుల వరకు అతని ఆచూకిలేదు. ఇదే సమయంలో రోడ్డు పక్కన ట్యాక్సీ డ్రైవర్ శవమై కనిపించాడు. ట్యాక్సీ డ్రైవర్ శరీరం మీద అనేక గాయాలు ఉండటంతో అతన్ని హత్య చేశారని, హంతకులను అరెస్టు చేసే వరకు శవాన్ని ముట్టుకోమని అతని కుటుంబ సభ్యులు, సాటి ట్యాక్సీ డ్రైవర్లు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. హంతకులను అరెస్టు చేస్తామని హామీ ఇచ్చిన పోలీసులు అధికారులు పలు కోణాల్లో విచారణ చేశారు. పోలీసులు ట్యాక్సీ డ్రైవర్ మొబైల్ ఫోన్ పరిశీలించగా అందులో చెన్నైకి చెందిన వ్యక్తి వివరాలు తెలిశాయి. ట్యాక్సీ డ్రైవర్ ను విషం ఇంజెక్షన్ ఇచ్చి పక్కాప్లాన్ తో చంపేశామని కేటుగాడు అంగీకరించాడు. ట్సాక్సీ డ్రైవర్ ను హత్య చెయ్యడానికి అతని భార్య కూడా సహకరించిందని వెలుగు చూడటం కలకలం రేపింది.
Illegal affair: భర్త చనిపోయి వారం కాకుండానే కోడలు ?, అత్తకు డౌట్, మొబైల్ ఫోన్ లో!

ట్యాక్పీ డ్రైవర్
తమిళనాడులోని కోయంబత్తూరులో బాబు అనే ట్యాక్సీ డ్రైవర్ నివాసం ఉంటున్నాడు. సొంతంగా కారు పెట్టుకుని అద్దెకు తిప్పుతున్న బాబు డబ్బులు సంపాధిస్తున్నాడు. ఎవరైనా తెలిసిన వాళ్లు కారు అద్దెకు కావాలంటే బాబు అతని కారు తీసుకుని వెలుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ట్యాక్సీ డ్రైవర్ బాబు తాను చెన్నైకి వెలుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లాడు.

రోడ్డు పక్కన శవమైన ట్యాక్సీ డ్రైవర్
రెండు రోజుల వరకు ట్యాక్సీ డ్రైవర్ ఆచూకిలేదు. ఇదే సమయంలో రోడ్డు పక్కన ట్యాక్సీ డ్రైవర్ బాబు శవమై కనిపించాడు. ట్యాక్సీ డ్రైవర్ బాబు శరీరం మీద అనేక గాయాలు ఉండటంతో అతన్ని హత్య చేశారని, హంతకులను అరెస్టు చేసే వరకు శవాన్ని ముట్టుకోమని అతని కుటుంబ సభ్యులు, సాటి ట్యాక్సీ డ్రైవర్లు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు.

మొబైల్ ఫోన్ లో చెన్నై కేటుగాడి వివరాలు
బాబును హత్య చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో, పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. బాబును హత్య చేసిన హంతకులను అరెస్టు చేస్తామని హామీ ఇచ్చిన కోంబత్తూరు జిల్లా ఎస్పీ సెల్వ నాగరత్నంతో పాటు సీనియర్ పోలీసులు అధికారులు పలు కోణాల్లో విచారణ చేశారు. పోలీసులు ట్యాక్సీ డ్రైవర్ బాబు మొబైల్ ఫోన్ పరిశీలించగా అందులో చెన్నైకి చెందిన స్టీఫెన్ అనే వ్యక్తి వివరాలు బయటకు వచ్చాయి.

భార్యను అడ్డం పెట్టుకుని చంపేశాడు
సీఫ్టెన్ ట్యాక్సీ డ్రైవర్ బాబు కారును బుక్ చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. బాబును కారులో పిలుచుకుని వెళ్లిన తరువాత వాడవల్లి ఓనపాళ్యం సమీపంలో సీఫ్టెన్, అతని భార్య అమల కలిసి ట్యాక్సీ డ్రైవర్ బాబుకు విషం ఇంజెక్షన్ ఇచ్చి పక్కాప్లాన్ తో చంపేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ట్యాక్సీ డ్రైవర్ ను మేమె హత్య చేశామని స్టీఫెన్, అతని భాక్య అమల అంగీకరించారని పోలీసు అధికారులు తెలిపారు. ట్యాక్సీ డ్రైవర్ దగ్గర ఉన్న డబ్బు కోసం హత్య చేస్తే అతని దగ్గర కేవలం రూ. 6 వేలు మాత్రమే చిక్కిందని నిందితులు అంగీకరించారని పోలీసులు అన్నారు.

కిలాడీ స్కెచ్
డబ్బు కోసమే ట్యాక్సీ డ్రైవర్ ను హత్య చేశామని స్టీఫెన్, అతని భార్య చెబుతున్నారని, పలు కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. దంపతుల నుంచి డబ్బు, 20కి పైగా మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు సీజ్ చేశామని పోలీసు అధికారులు అంటున్నారు. గతంలో ఇలాగే రెండు హత్యలు జరిగాయని, ఆ కేసులతో సీఫ్టెన్, అమలకు ఏమైనా సంబంధం ఉందా ? అని విచారణ చేస్తున్నామని కోయంబత్తూరు జిల్లా ఎస్సీ సెల్వ నాగరత్నం మీడియాకు చెప్పారు. ట్సాక్సీ డ్రైవర్ ను హత్య చెయ్యడానికి సీఫ్టెన్ కు అతని భార్య అమల కూడా సహకరించిందని వెలుగు చూడటం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications