మీ మనవరాలినని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నా! కిరణ్ బేడిపై చిన్నారి సంచలన ఆరోపణలు!
ఢిల్లీ : పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై ఆమె మనవరాలు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కిరణ్ బేడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తన తండ్రిని ఇబ్బందులు పెడుతున్నారని ఆ చిన్నారి ఆరోపించింది. దీనికి సంబంధించి చిన్నారి తీసిన సెల్ఫీ వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం పోస్ట్ చేసిన వీడియోను కోర్టు ఆదేశాల మేరకు డిలీట్ చేశారు.

అమ్మమ్మ ఇబ్బందులు పెడుతోంది
దాదాపు 45 సెకన్ల నిడివి గల వీడియోలో చిన్నారి తన అమ్మమ్మ (కిరణ్‌బేడి) వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. పోలీసులతో బెదిరించి తన తండ్రిని ఎందుకు ఇబ్బందిపెడుతున్నారని ప్రశ్నించింది. గతంలో తన తల్లి, తండ్రిని చెప్పుతో కొట్టి, ఉమ్మేసి, హింసిస్తోందని చెబితే అది భార్యభర్తల మధ్య వ్యవహారమన్న మీరు.. ఇప్పుడు మీ పలుకుబడి ఉపయోగించి పోలీసులతో తన తండ్రిని ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించింది.

తండ్రి వద్ద సంతోషంగా ఉన్నా
తన మనవరాలిని కిడ్నాప్ చేశారంటూ కిరణ్ బేడి చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజంలేదని చిన్నారి స్పష్టం చేసింది. తాను ఇష్టపూర్వకంగా తండ్రి దగ్గరకు వచ్చాయని, ఆయన దగ్గర సురక్షితంగా, సంతోషంగా ఉన్నానని చెప్పింది. తనను తండ్రి నుంచి వేరు చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావని కిరణ్ బేడిని నిలదీసింది. మీరు చేసిన పనులు చూస్తుంటే మీ మనవరాలినని చెప్పుకునేందుకు సిగ్గుగా ఉండని వాపోయింది.

కోర్టు ఆదేశంతో వీడియో డిలీట్
దీపికా భరద్వాజ్ అనే ఫిల్మ్ మేకర్ గురువారం ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కిరణ్ బేడీ కోర్టును ఆశ్రయించడంతో వీడియో డిలీట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు వీడియోను డిలీట్ చేసినా అప్పటికే దాన్ని ట్విట్టర్‌లో 77,500వేల మంది చూశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications