Viral Video:ఆ నటిపై దాడి..ఏడుస్తూ వీడియో పోస్టు..!!

కోల్‌కత అత్యాచారం హత్య ఘటన మరువక ముందే మరోసారి ఈ నగరం వార్తల్లో నిలిచింది. బెంగాలీ నటి పాయెల్ ముఖర్జీపై గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి దాడి చేశారు. శుక్రవారం రాత్రి పాయెల్ ముఖర్జీ తన కారులో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. దాడి నుంచి తప్పించుకున్న పాయెల్ ముఖర్జీ కన్నీటి పర్యంతమయ్యారు. దాడి గురించి వివరిస్తూ ఓ వీడియో పోస్టు చేశారు.

శుక్రవారం రాత్రి బెంగాలీ నటి పాయెల్ ముఖర్జీ కోల్‌కతాలోని సదరన్ అవెన్యూలో కోల్‌కతా అత్యాచార ఘటన కేసులో న్యాయం డిమాండ్ చేస్తూ జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు తన కారులో బయలు దేరింది. కారు వెళుతుండగా బైకుపై వస్తున్న ఓ యువకుడు కారును ఓవర్ టేక్ చేసి కారుముందు బైకును ఆపాడు.బయటకు రావాల్సిందిగా పట్టుబట్టాడు అయితే పాయెల్ ముఖర్జీ కారునుంచి బయటకు దిగేందుకు నిరాకరించింది.దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి కారు కుడి అద్దంను ధ్వంసం చేశాడు.దీంతో కారులో ఉన్న నటి పాయెల్ ముఖర్జీకి తీవ్రగాయాలయ్యాయి. ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

Kolkata Actor Payel Mukherjee Posts Video After Alleged Biker Attack

ఒక మహిళపై నడిరోడ్డులో అది కూడా బాగా రద్దీగా ఉన్న ప్రాంతంలో కారును ఆపి దాడి చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని నటి పాయెల్ ముఖర్జీ వీడియోలో చెప్పారు. కోల్‌కతా నగరంలో అత్యాచారంకు గురైన జూనియర్ డాక్టర్‌కు న్యాయం చేయాలని నిరసనలు జరుగుతున్న వేళ తనపై దాడి జరగడం అమానుషం అని అన్నారు. ఇక మహిళలకు రక్షణ ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు.రద్దీ ఉన్న ప్రాంతంలో తనపై దాడి జరిగింది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డానని చెప్పిన పాయల్ ముఖర్జీ... అదే జన సంచారం లేని ప్రాంతంలో ఈ దాడి జరిగి ఉంటే తను ప్రాణాలతో ఉండేది కాదని పేర్కొంది.

పాయెల్ ముఖర్జీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పాయెల్ కారు తన బైకును రాసుకుంటూ వెళ్లడంతోనే దాడి చేసినట్లు యువకుడు చెప్పాడు. యువకుడు చెప్పినదాంట్లో నిజం లేదని పాయెల్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే దాడి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. బెంగాల్ బీజేపీ పాయెల్ ముఖర్జీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మమత సర్కార్ పై నిప్పులు చెరిగింది.మహిళలకు కోల్‌కతా నగరం అంటేనే భయపడేలా మమత సర్కార్ వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగింది. ఇదిలా ఉంటే మహిళలు నైట్ డ్యూటీలకు దూరంగా ఉండాలంటూ మమత ప్రభుత్వ సలహాదారు చెప్పడం నీచమని బీజేపీ పోస్టులో రాసుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+