టీషర్ట్, స్కర్ట్‌లకు కాలేజీలో నిషేధం: విద్యార్ధుల నిరసన
కోల్‌కత్తా: నగరంలోని ఓ కాలేజీ యాజమాన్యం జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. విద్యార్ధులను ఏమాత్రం సంప్రదించకుండా కాలేజీ యాజమాన్యం డ్రస్ కోడ్‌పై నిబంధనలు విధించడం తగదంటూ విద్యార్ధి సంఘాలు ఆందోళన బాట చేపట్టాయి.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కోల్‌కత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీ యాజమాన్యం విద్యార్ధులకు డ్రెస్ కోడ్ విధిస్తూ నోటీసులు జారీ చేశారు. అమ్మాయిలు మోకాళ్లకు బాగా కిందకు ఉండే స్కర్టులు, అబ్బాయిలు రౌండ్ నెక్ టీషర్ట్‌లు, టాప్స్ ధరించి రావద్దని సూచించింది.

వాటిపై ఎలాంటి స్లోగన్లు ఉండకూడదని కూడా పేర్కొంది. కాలేజీ వాతావరణానికి సరిపడే దుస్తులు మాత్రమే ధరించాలని ఆ నోటీసులో పేర్కొంది. ముఖ్యంగా విద్యార్ధినీ విద్యార్ధులు సల్వార్ కమీజులు, చీరలు మొదలైన దుస్తులు ధరించి కళాశాలకు రావాలని సూచించింది.
అంతేకాదు, అబ్బాయిలు చెవులకు రింగులు ధరించడాని కూడా నోటీసులో తప్పుబట్టింది. కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో విద్యార్ధి సంఘాలు సోమవారం నుంచి ఆందోళనకు దిగాయి. మరోవైపు విద్యావేత్తలు, మేధావులు ఈ నిర్ణయంపై విమర్శిస్తున్నారు.
విద్యావేత్త పబిత్రా సర్కార్ మాట్లాడుతూ ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి అనాగరిక నిబంధనలేంటని ప్రశ్నించారు. ఉద్యమకారుడు మిరుతున్ నహార్ మాట్లాడుతూ విద్యార్థుల స్వేచ్ఛా స్వాత్యంత్ర్యాలకు ఇది తీరని భంగపాటు అని అన్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications