Viral Video: ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! దొంగతనానికి వచ్చి..
సినిమా రేంజ్ లో దొంగతనం చేయడానికి వచ్చి.. ఇలా బొక్కలో ఇరుక్కుయాడు ఓ దొంగ. సుమారు గంట పాటు ఆ రంధ్రంలో ఇరుక్కుని నరకయాతన అనుభవించాడు. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్ లోని కోటాలో జరిగింది. నిందితుడ్ని గంట పాటు శ్రమించి అతి కష్టం మీద బయటకు తీశారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
రాజస్థాన్ కోటాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఇంట్లో చోరీకి వచ్చి కిచెన్ లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కుపోయాడు ఓ దొంగ. ఆ రంధ్రం గుండా ఇంట్లోకి దూరి చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. కానీ రంధ్రం చిన్నగా ఉండడంతో అందులోనే ఇరుక్కుపోయాడు. ముందుకూ వెళ్లలేక..వెనక్కూ వెళ్లలేక అతడి శరీరం బొక్కలోనే ఇరుక్కుపోయింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. శుభాష్ కుమార్ రావత్ అనే వ్యాపారి తన కుటుంబంతో కలిసి ఊరెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన ఓ దొంగ.. ఇంట్లో చోరీ చేయాలని భావించాడు.
ఈ క్రమంలో కిచెన్ లో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం గుండా ఇంటి లోపలికి వెళ్లాలని ప్లాన్ వేశాడు. అలా రంధ్రం గుండా వెళ్తూ ఇరుక్కుపోయాడు. ముందుకూ.. వెనక్కూ వెళ్లలేక అక్కడే ఇరుక్కునిపోయాడు. అతడి సగం బాడీ లోపలికి మరో సగం బాడీ బయటకు ఉంది. ఈ క్రమంలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో శుభాష్ కుమార్ రావత్ భార్య ఇంట్లోకి వచ్చింది. ఏదో అలికిడి శబ్దం కిచెన్ నుంచి వినిపించింది. కిచెన్ లోకి వెళ్లి చూడగా ఓ వ్యక్తి కిచెన్ రంధ్రంలో ఇరుక్కుని కనిపించాడు.

దీంతో భయంతో ఆమె స్థానికులకు సమాచారం ఇచ్చింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. రంధ్రంలో ఇరుక్కున్న దొంగను గంటపాటు శ్రమించి బయటకు తీశారు. వెంటనే అతడ్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు పలు విధాలుగా రియాక్ట్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications