ముచ్చటగా మూడు కారణాలతో సీఎం రేసు నుంచి తప్పుకున్నా, డీకే శివకుమార్ మాటతో !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరు ఖరారు అయ్యింది. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించనుంది. సీఎం సీటు కోసం సిద్దరామయ్యకు ఇన్ని రోజులు సినిమా చూపించిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తాను ఎందుకు సీఎం రేసు నుంచి తప్పుకున్నానో అని క్లారిటీ ఇచ్చారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతకాలం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చుక్కలు చూపించిన కాంగ్రెస్ పార్టీ ఎవ్వరూ ఊహించని విధంగా 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంలో మాకష్టం చాలా ఉందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు వాదించారు.-

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తమ కష్టం ఎంతో ఉందని, అందుకే తనను సీఎం చెయ్యాలని సిద్దరామయ్య, లేదు నా కారణంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేపీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇన్ని రోజులు సీఎం కుర్చీ కోసం పోట్లాడుకున్నారు. అయితే ఇన్ని రోజుల నుంచి సీఎం కుర్చీ ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ తలలు పట్టుకుంది.
చివరికి సీఎం సీటు సిద్దరామయ్యకు ఇచ్చేయడానికి డీకే శివకుమార్ అంగీకరించారు. తాను సీఎం రేస్ నుంచి ఎందుకు తప్పుకున్నానో అనే విషయంపై డీకే శివకుమార్ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వూలో క్లారిటీ ఇచ్చారు. తనకు సీఎం పదవికంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎక్కువ అని, పార్టీకి చెడ్డపేరు రాకూడదు అని తాను సీఎం రేసు నుంచి తప్పుకున్నానని డీకే శివకుమార్ అన్నారు.

కర్ణాటక ప్రజలకు పలు హామీలు ఇచ్చి తాము అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లామని, మమ్మల్ని నమ్మిన కర్ణాటక ప్రజలు మాకు ఓట్లు వేసి గెలిపించారని, ఎవరి మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ప్రజలు మమ్మల్ని దీవించారని, తన పదవి కంటే ప్రజల యోగక్షేమాలు ముఖ్యం అని, ఆ మూడుకారణాలతో తాను సీఎం రేసు నుంచి తప్పుకున్నానని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెప్పారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నేరవేర్చడానికి మాకు అవకాశం వచ్చిందని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికే సీఎం సీటు కోసం రాద్దాంతం చెయ్యకూడదని తాను సీఎం సీటు రేస్ నుంచి తప్పుకున్నానని డీకే శివకుమార్ వివరించారు. పార్టీ కోసం, ప్రజల కోసం సీఎం రేసు నుంచి తప్పుకుని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సీఎం పదవిని త్యాగం చేసిన డీకే శివకుమార్ నేడు సోషల్ మీడియాలో హీరో అయిపోయారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications