కనకపుర రాజకీయాల ఢిల్లీ లెక్కలు తారుమారు చేసిన డీకేశి, భారీ మెజార్టీ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిమిష నిమిషానికి లెక్కలు మారిపోతున్నాయి. బెంగళూరు శివార్లలోని కనకపుర అసెంబ్లీ నియోజక వర్గం రాజకీయాలను ఢిల్లీలో లెక్కలు వేస్తున్నారు. కనకపురలో పోటీ చేసిన డీకే శివకుమార్ ఇప్పటికే 15 వేల మెజారిటీతో విజయం వైపు దూసుకుపోతున్నారు.
కనకపురలో డీకే శివకుమార్ ను ఓడించాలని ప్లాన్ చేసిన బీజేపీ హైకమాండ్ ఆ నియోజక వర్గంలో ఒక్కలిగ నాయకుడు, మంత్రి ఆర్ అశోక్ ను బరిలో దింపారు. ఇప్పటికే 7 సార్లు ఎమ్మెల్యే అయిన డీకే శివకుమార్ మరోసారి ఎన్నికల్లో పోటీ చేశారు. తన నామినేషన్ తిరస్కరిస్తారని మొదట భయపడిన డీకే శివకుమార్ ముందు జాగ్రత్త చర్యగా ఆయన తమ్ముడు డీకే. సురేష్ తో నామినేషన్ వేయించారు.

చివరికి డీకే. శివకుమార్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు ఓకే చెయ్యడంతో ఆయన బరిలోకి దిగారు. రామనగరలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ లో కౌంటింగ్ జరుగుతోంది. కనకపుర అసెంబ్లీ నియోజక వర్గం ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుంచి కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ ముందంజలో ఉన్నారు.
డీకే శివకుమార్ మీద పోటీ చేసిన బీజేపీ మంత్రి ఆర్. అశోక్ వెనుకపడిపోయారు. ఒక్కలిగుల ఓట్లు చీల్చాలని ప్లాన్ చేసిన బీజేపీ హైకమాండ్ కు కనకపుర ఓటర్లు షాక్ ఇచ్చారు. కనకపుర బండే రాజకీయాలు బయట వ్యక్తులు చేస్తే ఒప్పుకోమని ఆ నియోజక వర్గం ఓటర్లు తేల్చి చెబుతున్నారు.

కనకపురలో డీకే శివకుమార్ విజయం నల్లేరుమీదనడకే అయినా ఆయన ఎంత మెజారిటీతో గెలుస్తారు ? అని అందరూ ఆకసక్తిగా ఎదురు చూస్తున్నారు. డీకే. శివకుమార్ ను ఓడించాలని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా తదితరులు అనేక స్కెచ్ లు వేశారు. అయితే కనకపుర ఓటర్ల నాడిపసిగట్టిన డీకే. శివకుమార్, ఆయన సోదరుడు డీకే. సురేష్ పక్కాప్లాన్ తో ఎన్నికల ప్రచారం చేశారు. మొత్తం మీద ఢిల్లీలోని బీజేపీ నాయకులు వేసిన కనకపుర రాజకీయాల లెక్కలు తారుమారు అవుతున్నాయి.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్-తెలంగాణ హైకోర్టు బెయిల్ పై..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications