మేము ఫ్రెండ్స్, ముందు ముందు మీరే చూస్తారని చెప్పిన డీకే శివకమార్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరును కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. మీడియా ముందుకు రాకముందే అన్ని చర్చలు ఫలించడం, డీకే శివకుమార్ శాంతించడంతో పరిస్థితి కుదటపడింది. ఇదే సమయంలో డీకే శివకుమార్ ఆయన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీ కోసం నాలుగు రోజుల నుంచి సిద్దరామయ్య, డీకే శివకుమార్ పోట్లాడుకుంటున్న విషయం తెలిసిందే. నానాతంటాలు పడిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చివరికి ఇద్దరిని రాజీ చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేర్లు ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఊపిరిపీల్చుకుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ప్రజలకు పలు హామీలు ఇచ్చి తాము అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లామని, మమ్మల్ని నమ్మిన కర్ణాటక ప్రజలు మాకు ఓట్లు వేసి గెలిపించారని, ఎవరి మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ప్రజలు మమ్మల్ని దీవించారని, తన పదవి కంటే ప్రజల యోగక్షేమాలు ముఖ్యం అని, ఆ మూడుకారణాలతో తాను సీఎం రేసు నుంచి తప్పుకున్నానని డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నేరవేర్చడానికి మాకు అవకాశం వచ్చిందని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికే సీఎం సీటు కోసం ఎక్కువ సాగతియ్యకూడదని తాను సీఎం సీటు రేస్ నుంచి తప్పుకున్నానని డీకే శివకుమార్ వివరించారు. నేను, సిద్దరామయ్య కలిసే ఉన్నామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.

తాను సీఎం రేసు నుంచి తప్పుకుని సిద్దరామయ్యను ముఖ్యమంత్రి చేస్తున్నామని డీకే శివకుమార్ అన్నారు. తాను సిద్దరామయ్య కలిసే ఉన్నామని, మా ఇద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి విభేదాలు లేవని, ఇద్దరు కలిసి పని చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో కలిసి తీసుకున్న ఫోటోలను డీకే శివకుమార్ ఆయన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చెయ్యడంతో అవి వైరల్ అవుతున్నాయి.
Karnataka's secure future and our peoples welfare is our top priority, and we are united in guaranteeing that. pic.twitter.com/sNROprdn5H
— DK Shivakumar (@DKShivakumar) May 18, 2023
కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నేరవేరుస్తామని డీకే శివకుమార్ తెలిపారు. ముందు ముందు మా పనితీరు ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా అంటూ డీకే శివకుమార్ అంటున్నారు. మొత్తం మీద ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ వెనక్కి తగ్గడవ వెనుక చాలా కథ ఉంటుందని తెలిసింది.












Click it and Unblock the Notifications