శశికళకు షాక్:ఆర్గనైజింగ్ కార్యదర్శి పదవికి పాండ్యన్ రాజీనామా,దినకరన్ కారణమా?
శశికళ కీలకమైన పదవులను తన కుటుంబసభ్యులకు కట్టబెట్టడంపై పార్టీ సీనియర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమ అసంతృప్తిని రాజీనామాల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
చెన్నై:శశికళ కీలకమైన పదవులను తన కుటుంబసభ్యులకు కట్టబెట్టడంపై పార్టీ సీనియర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమ అసంతృప్తిని రాజీనామాల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
అన్నాడిఎంకె ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉన్న వికె పాండ్యన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే శశికళ జైలుకు వెళ్ళే ముందు డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవికి దినకరన్ నియమిస్తూ శశికళ నిర్ణయం తీసుకొన్నారు.
శశికళ తీసుకొన్న నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి గురైన వికె పాండ్యన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు బుదవారం నాడు మధ్యాహ్నం రాజీనామా చేశారు.

బుదవారం నాడు ఉదయం డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవికి దినకర్ ను నియమిస్తూ శశికళ నిర్ణయం తీసుకొంది. దినకరన్ కు కీలకమైన పదవిని చేపట్టడం వల్ల శశికళ వర్గంలోని కొందరు నాయకులు అసంతృప్తితో ఉన్నారని సమాచారం.
పార్టీపై తన పట్టును కోల్పోకుండా ఉండేందుకుగానే జైలుకు వెళ్ళే ముందే దినకరన్ ను ఆమె డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని కట్టబెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే దినకరన్ కు పదవి కట్టబెట్టడమే ప్రస్తుతం మరింతగా పార్టీని ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications