సెక్స్ వీడియో: నాలుక మడతపెట్టిన కుమారస్వామి
Prajwal Revanna: రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం సన్నద్ధమౌతోన్న కర్ణాటకలో సెక్స్ స్కాండల్ వీడియో దుమారం రేపుతోంది. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం జనతాదళ్ (సెక్యులర్) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి అన్న కొడుకు, నటుడు ప్రజ్వల్ రేవణ్న ఈ స్కాంకు కేంద్ర బిందువు కావటం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం చెలరేగింది.
కుమారస్వామి అన్న, మాజీ మంత్రి రేవణ్న కుమారుడే ప్రజ్వల్ రేవణ్న. హసన్ లోక్‌సభ సిట్టింగ్ ఎంపీ కూడా. 2019 నాటి ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థిగా ఆయన ఇక్కడి నుంచే విజయం సాధించారు. ఇప్పుడు కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచారు. ఈ స్థానానికి ఈ నెల 26వ తేదీ నాడే పోలింగ్ ముగిసింది.

లోక్‌సభ ఎన్నికల వేళ తాజాగా ప్రజ్వల్ రేవణ్న సెక్స్ స్కాండల్ వీడియో వెలుగులోకి రావడంతో జేడీఎస్ అగ్రనాయకత్వం పూర్తిగా డిఫెన్స్‌లోకి వెళ్లింది. ఆత్మరక్షణలో పడింది. ఈ స్కాండల్ నుంచి బయటపడటానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. మే 7వ తేదీన రెండో విడత పోలింగ్‌పై దీని ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఈ క్రమంలో ప్రజ్వల్ రేవణ్న విషయంపై కుమారస్వామి మాట మార్చారు. పోలింగ్‌కు ముందు ప్రజ్వల్ తరఫున హాసన్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కుమారస్వామి ఆయనను తన కొడుకుగా అభివర్ణించారు. తన కుమారుడిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Shameless HD Kumaraswamy 🤮
— Veena Jain (@DrJain21) April 28, 2024
Four days Back : Prajwal is my son, Vote him 🤗
Today : I don't have any relationship with it, SIT should bring him back 🤡
Why HDK is not asking him to surrender? #PrajwalRevanna #Karnataka #ArrestPrajwalRevanna #Hassanpic.twitter.com/xA2tSgw3Mt
ఈ సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చిన తరువాత నాలుక మడతపెట్టారు కుమారస్వామి. ప్రజ్వల్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ప్రజ్వల్‌తో గానీ, ఈ కేసుతో గానీ తనకు, జేడీఎస్‌కూ సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. సిట్ తన పని తాను చేసుకుని పోతుందని వ్యాఖ్యానించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications