కుంభమేళా మోనాలిసా జస్ట్ మిస్.. లేదంటే కొంప కొల్లేరే..!
కుంభమేళా పుణ్యమా అంటూ మోనాలిసా అనే యువతి వెలుగులోకి వచ్చింది.ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో పూసలు అమ్ముతూ కనిపించిన మోనాలిసా ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె అందమైన కళ్ళు, ప్రత్యేకమైన రూపం అందరి దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఆమె రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది.ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఇదే అదునుగా భావించిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా వెంటనే రంగంలోకి దిగాడు. 'ది డైరీ ఆఫ్ మణిపూర్' అనే సినిమాలో మోనాలిసాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు.సినిమా అవకాశాలతో పాటు, ఆమె జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాలలో కూడా పాల్గొంది. అలాగే ఆమె ఒక ప్రకటనలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
ఇక్కడ వరకు కథ బాగానే నడిచింది. అయితే దర్శకుడు సనోజ్ మిశ్రా తీరుపైనే మొదటి నుంచి కూడా విమర్శలు వినిపించాయి. అతను మంచివాడు కాదని గతంలో కొందరు విమర్శలు గుప్పించారు.అతను సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి పలువురు అమ్మాయిలపై అత్యాచారం చేశారనే ఆరోపణలు తెర మీదకు వచ్చాయి.సనోజ్ మిశ్రా దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదని, అతను తాను గొప్ప దర్శకుడునంటూ చెప్పుకుని అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడని సినీ ఇండస్ట్రీకి చెందని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. సరిగ్గా అతను చెప్పినట్టుగానే సనోజ్ మిశ్రాపై అత్యాచారం కేసు నమోదైంది.

దర్శకుడు సనోజ్ మిశ్రాను అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని, సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం ఇస్తానని నమ్మబలికి అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. సనోజ్ మిశ్రా మొదట పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. ఆ తర్వాత సినిమాల్లో నటించమని ప్రలోభపెట్టి, బెదిరించి మౌనంగా ఉండమన్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట తప్పాడు.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2025 ఫిబ్రవరిలో నిందితుడు బాధితురాలిని నబీ కరీంలోని హోటల్ శివకు తీసుకువెళ్లినప్పుడు అరెస్టు చేశారు. దర్శకుడు సనోజ్ మిశ్రా ఆ మహిళతో శారీరక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత ఆమెను విడిచిపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. సనోజ్ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో అరెస్టు జరిగింది. ఈ కేసులో పూర్తి విచారణ ఇంకా కొనసాగుతోంది.
సనోజ్ మిశ్రా మొదట పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. ఆ తర్వాత సినిమాల్లో నటించమని ప్రలోభపెట్టి, బెదిరించి మౌనంగా ఉండమన్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట తప్పాడు.దీంతో సదరు యువతి దర్శకుడు సనోజ్ మిశ్రాపై కేసు నమోదు చేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం మొత్తం మీద సేవ్ అయింది మాత్రం మోనాలిసా అనే చెప్పాలి. లేదంటే దర్శకుడు సనోజ్ మిశ్రా ఖాతాలో ఆమె కూడా బలి అయి ఉండేది. ఈ పరిణామాల నేపథ్యంలో మోనాలిసా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications