లడ్డూ కేక్‌లు, లోటస్ స్వీట్లు.. గ్రాండ్ విక్టరీ సెలబ్రేషన్స్‌కు బీజేపీ రెడీ..

ఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో జోష్ మీదున్న బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారం చేపడతామని ధీమాతో ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే సంబురాలకు సిద్ధమవుతోంది. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. లడ్డూ కేక్‌లు, లోటస్ స్వీట్లతో విక్టరీని సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించింది.

దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహించాలని బీజేపీ శ్రేణులు నిర్వహించాయి. ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీ హెడ్ క్వార్టర్‌లో కేక్ కట్ చేయడంతో పాటు స్వీట్లు పంచేందుకు సన్నాహాలు చేస్తోంది. మోతీచూర్ లడ్డూలతో 7కిలోల స్పెషల్ కేక్‌ను తయారు చేయించిన నేతలు సాయంత్రం దాన్ని కట్ చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు బెంగాలీ పేస్ట్రీ షాప్ నుంచి స్పెషల్‌గా లోటస్ షేప్‌లో తయారు చేసిన స్వీట్లను తెప్పించారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు పార్టీ చీఫ్ అమిత్ షా హెడ్ క్వార్టర్స్‌లో జరిగే సెలబ్రేషన్స్‌లో పాల్గొనే అవకాశముంది.

Laddoo Cake, Lotus-Shaped Sweets BJP Prepares For Comeback

ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ 50 కేజీల పిస్తా - బాదం బర్ఫీ తయారుచేయించారు. ఇందుకోసం లక్ష రూపాయలు ఖర్చు చేశారు. ఫలితాలు వెలువడిన వెంటనే వాటిని పంచనున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన వెంటనే గెలుపుపై ధీమాతో ఉన్న బీజేపీ శ్రేణులు సంబురాలు మొదలుపెట్టాయి. ముంబైలో బీజేపీ కార్యకర్తలు 2వేల కేజీల లడ్డూలు పంచి పెట్టాలని నిర్ణయించారు. నరేంద్రమోడీ మాస్క్‌లు ధరించిన వ్యక్తులు లడ్డూలు తయారు చేస్తున్నారు.

ముంబైలోని పార్టీ హెడ్ క్వార్టర్స్‌లో భారీ కేక్ కట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ 125 కేజీల భారీ కేక్ కట్ చేయనున్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయ దుందుభిమోగిస్తుందన్న ఎగ్జిట్ పోల్ అంచనాల నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో సంబురాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+