Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ladies tailor: శివతాండవం చేసిన అత్త, కసితీరా కొట్టి చంపిన కోడలు, అసలు కథ తెలిసి షాక్ !

బెంగళూరు/సింధనూరు/చెన్నై: ఒకే ఇంట్లో ఉంటున్న అత్తా కోడలు మొదట కలిసి మెలసి సంతోషంగా ఉండేవారు. ఇటీవల ఇంట్లో ఉన్న అత్త దారుణ హత్యకు గురైయ్యింది. నేను ఇంటికి వెళ్లి చూడగా తన అత్త చనిపోయి ఉందని కోడలు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. అత్త తల మీద దాడి చేసి చంపేశారని కేసు నమోదు అయ్యింది. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో అత్త హత్యకు గురి కావడంతో మొదట కుటుంబ సభ్యుల మీద అనుమానం రాలేదు. పోలీసుల విచారణలో టైలరింగ్ పని చేస్తున్న కోడలి వ్యవహారం వెలుగు చూడటంతో కథ కొత్త మలుపు తిరిగింది. శివతాండవం చేసిన అత్తను ఆమె కోడలు కసితీరా కొట్టి చంపేసిందని అసలు కథ వెలుగు చూడటంతో అందరూ షాక్ అయ్యారు.

ఒకే ఇంట్లో అత్తా కోడలు

ఒకే ఇంట్లో అత్తా కోడలు

కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని సింధనూరు తాలుకాలోని మల్లాపుర గ్రామంలో కమలమ్మ అలియాస్ మీనాక్షమ్మ అనే మహిళ నివాసం ఉంటున్నది. కమలమ్మ ఇంటిలోనే ఆమె కోడలు సీతా కూడా ఒకే ఇంట్లో కలిసి కాపురం ఉంటోంది. ఒకే ఇంట్లో ఉంటున్న అత్త కమలమ్మ, ఆమె కోడలు సీతా మొదట్లో కలిసి మెలసి సంతోషంగా ఉండేవారు.

 కోడలు లేడీస్ టైలర్

కోడలు లేడీస్ టైలర్

సీత లేడీస్ టైలర్ గా పని చేస్తోంది. ప్రతిరోజు ఉదయం బయటకు వెలుతున్న సీతా టైలరింగ్ పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వెలుతోంది. ఇటీవల ఇంట్లో ఉన్న అత్త కమలమ్మ దారుణ హత్యకు గురైయ్యింది. నేను ఇంటికి వెళ్లి చూడగా తన అత్త కమలమ్మ చనిపోయి ఉందని కోడలు సీతా ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చింది.

 ఫ్యామిలీ మీద డౌట్ రాలేదు

ఫ్యామిలీ మీద డౌట్ రాలేదు

అత్త కమలమ్మ తల మీద దాడి చేసి చంపేశారని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో కేసు నమోదు అయ్యింది. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో అత్త కమలమ్మ హత్యకు గురి కావడంతో మొదట కుటుంబ సభ్యుల మీద పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు.

 కోడలి మీద అనుమానం

కోడలి మీద అనుమానం

పోలీసుల విచారణలో టైలరింగ్ పని చేస్తున్న కమలమ్మ కోడలు సీతా వ్యవహారం మీద అనుమానం వచ్చింది. కోడలు సీతా తీరుకూడా అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు ఆమె మీద నిఘా వేశారు. ఇదే సమయంలో కమలమ్మ తల మీద మెదడు పక్కన బలమైన కర్రలతో దాడి చెయ్యడం వలనే ఆమె ప్రాణం పోయిందని పోస్టుమార్టుం నివేదికలో వెలుగు చూసింది.

 శివతాండవం చేసిన అత్త...... రెచ్చిపోయిన కోడలు

శివతాండవం చేసిన అత్త...... రెచ్చిపోయిన కోడలు

టైలరింగ్ పని చేస్తున్న కోడలు సీతా సంపాధించిన డబ్బు ఇంట్లో ఇవ్వకుండా ఆమె జల్సాలు చేస్తోందని, ఆ డబ్బు ఎవరికో ఇస్తోందని అనుమానంతో అత్త కమలమ్మ ఆమెను అమ్మనా బూతులు తిట్టేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. డబ్బులు సక్రమంగా ఇవ్వడం లేదని, ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్లి తిరుగుతున్నావని, ఎవరితో తిరుగుతున్నావు, ఎవడికి డబ్బులు ఇస్తున్నావు అంటూ నోటికి వచ్చినట్లు తనను అత్త కమలమ్మ దూషించిందని సీతా పోలీసులకు చెప్పింది.

 బూతులు తిడుతోందని చంపేశాను

బూతులు తిడుతోందని చంపేశాను

అత్త కమలమ్మ తనను బూతులు తిట్టడంతో కోపంతో తానే కర్ర తీసుకుని ఆమె తల మీద దాడి చేశానని సీతా పోలీసుకు చెప్పింది. అత్త కమలమ్మ బూతులు తిట్టడం వలనే కోపంతో సీతా ఆమెను చంపేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కోపంతో తానే అత్తను హత్య చేశానని సీతా అంగీకరించడంతో ఆమెను అరెస్టు చేశామని సింధనూరు పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+