Lady doctor: ఎప్పుడు పడితే అప్పుడు ఆసుపత్రికి వెలుతున్న భార్య, చంపేసి ఎస్కేప్ అయిన భర్త !
ఆగ్రా/ లక్నో: ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్న మహిళ ఆమె భర్త, పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నది. గత 18 నెలల నుంచి కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న లేడీ డాక్టర్ సాటి ఉద్యోగులు దగ్గర, ప్రజల దగ్గర మంచి పేరు సంపాదించుకుంది. కొంతకాలంగా లేడీ డాక్టర్ దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. కోవిడ్ కేర్ సెంటర్ లో డిప్యూటేషన్ మీద ఉద్యోగం చేస్తున్న లేడీ డాక్టర్ రాత్రి ఇంటికి వెళ్లింది. అర్దరాత్రి భర్త ఇంటి బయట తాళం వేసుకుని పిల్లలను పిలుచుకుని అతని అన్నయ్య ఇంటికి వెళ్లాడు. రాత్రి పిల్లలను అక్కడే వదిలేసిన లేడీ డాక్టర్ భర్త మాయం అయిపోయాడు. మరుసటి రోజు లేడీ డాక్టర్ ఇంటి బయట వేసిన తాళం తీసి లోపలికి వెళ్లి చూడగా ఆమె బెడ్ రూమ్ లో ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించడం కలకలం రేపింది.

ప్రభుత్వ ఆసుపత్రిలో భార్య డాక్టర్
ఉత్తరప్రదేశ్ లోని ఆలీఘర్ నగరంలోని రమేష్ విహార్ లో అస్త అగర్వాల్ అనే మహిళ నివాసం ఉంటున్నది. రమేష్ విహార్ లో భర్త అగర్వాల్, ఇద్దరు పిల్లలతో కలిసి అస్త అగర్వాల్ ఉంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్న అస్త అగర్వాల్ ఆమె భర్త అగర్వాల్, ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నది.

కోవిడ్ రోగులకు చికిత్స
గత 18 నెలల నుంచి కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న లేడీ డాక్టర్ అస్త అగర్వాల్ సాటి ఉద్యోగులు దగ్గర, స్థానిక ప్రజల దగ్గర మంచి పేరు సంపాదించుకుంది. కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి లేడీ డాక్టర్ అస్త అగర్వాల్ ఎప్పుడు పడితే అప్పుడు ఆసుపత్రికి వెళ్లి వారికి చికిత్స చేస్తూ తీరికలేకుండా గడుపుతోందని సమాచారం.

దంపతుల మద్య గొడవలు
కొంతకాలంగా అగర్వాల్, అతని భార్య లేడీ డాక్టర్ అస్త అగర్వాల్ ల మద్య గొడవలు జరుగుతున్నాయి. ఆలీఘర్ లోని కోవిడ్ కేర్ సెంటర్ లో డిప్యూటేషన్ మీద ఉద్యోగం చేస్తున్న లేడీ డాక్టర్ అస్త అగర్వాల్ రాత్రి ఇంటికి వెళ్లింది. అర్దరాత్రి 12.30 గంటల సమయంలో అగర్వాల్ ఇంటి బయట తాళం వేసుకుని పిల్లలను పిలుచుకుని అతని అన్నయ్య ఇంటికి వెళ్లాడు.

ఇంట్లో శవమైన లేడీ డాక్టర్
రాత్రి పిల్లలను అక్కడే వదిలేసిన లేడీ డాక్టర్ భర్త అస్త అగర్వాల్ భర్త అగర్వాల్ తరువాత మాయం అయిపోయాడు. గురువారం లేడీ డాక్టర్ కుటుంబ సభ్యులు, పోలీసులు ఇంటి బయట వేసిన తాళం తీసి లోపలికి వెళ్లి చూడగా అస్త అగర్వాల్ ఆమె బెడ్ రూమ్ లో ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించడం కలకలం రేపింది.
Recommended Video

చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త ?
అస్త అగర్వాల్ ను ఆమె భర్త అగర్వాల్ హత్య చేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించి అతను పరారైనాడని లేడీ డాక్టర్ కుటుంబ సభ్యులు కేసు పెట్టారని పోలీసు ఇన్స్ పెక్టర్ శ్వేతభ్ పాండే స్థానిక మీడియాకు చెప్పారు. అగర్వాల్ కోసం ఆలీఘర్ పోలీసులు గాలిస్తున్నారని ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.












Click it and Unblock the Notifications