మహిళ వైద్యురాలిపై కార్మికుడి అత్యాచారయత్నం
బూర్ద్వాన్: విశ్రాంతి గదిలో ఉన్న మహిళ వైద్యురాలు (పీజీ విద్యార్థిని)మీద అదే చోట పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు అత్యాచారయత్నం చేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. కామాంధుడిని సాటి మహిళ వైద్యురాలు పోలీసులకు పట్టించింది.
బూర్ద్వాన్ మెడికల్ కాలేజ్ లో శుక్రవారం రాత్రి మహిళ వైద్యులు (పీజీ విద్యార్థినిలు) అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఇదే ఆసుపత్రిలో ప్రసూన్ నాయక్ కాంట్రాక్టు కార్మికుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇతను విధులలో ఉన్నాడు.
అర్దరాత్రి దాటిన తరువాత మహిళ వైద్యురాలు విశ్రాంతి తీసుకోవడానికి రెస్ట్ రూంలోకి వెళ్లారు. ఆమె విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ప్రసూన్ నాయక్ అక్కడికి వెళ్లి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో సాటి మహిళ వైద్యురాలు విషయం గుర్తించింది.

వెంటనే ఆసుప్రతిలో ఉన్న అలారమ్ ఆన్ చేసి అక్కడ ఉన్న సిబ్బందిని అలర్ట్ చేసింది. వెంటనే సిబ్బంది విశ్రాంతి గది దగ్గరకు వెళ్లిన సమయంలో ప్రసూన్ నాయక్ రెడ్ హ్యాండెడ్ గా చిక్కి పోయాడు. ఆసుపత్రి సిబ్బంది ప్రసూన్ నాయక్ కు దేహశుద్ది చేశారు.
ఈ విషయంపై ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఉత్పల్ డాన్ స్పందిస్తూ ప్రసూన్ నాయక్ దగ్గర క్షమాపణ పత్రం వ్రాయించుకుని పోలీసులకు అప్పగించామని అన్నారు. ఇక ముందు మహిళ వైద్యులకు గట్టి భద్రత కల్పిస్తామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications