Video: మోదీకి వీడియో పంపించిన మాజీ డిప్యూటీ మేయర్, నా భర్త టార్చర్ తట్టుకోలేను !
బెంగళూరు/న్యూఢిల్లీ: బెంగళూరు సిటీ మాజీ డిప్యూటీ మాజీ మేయర్ ఆత్యహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. చీరతో ఉరి వేసుకుని వీడియో తీసిన ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి వీడియో పంపిస్తూ ఆత్మహత్యాయత్నం చేసింది. తన భర్త, పోలీసు అధికారులు తనను టార్చర్ పెడుతున్నారని, మీరే నాకు రక్షణ కల్పించాలని, లేదంటే నేను ఆత్మహత్య చేసుకోవడానికి మీ అనుమతి కావాలని ఆమె ప్రధాని మోదీకి మనవి చేశారు. నువ్వు మాజీ డిప్యూటీ మేయర్ మాత్రమే, ఎక్కువ చెయ్యకూడదు అంటూ లేడీ ఎస్ఐ, పోలీసులు బెదిరిస్తున్నారని, కొంతకాలం తరువాత మీరు కూడా మాజీ ప్రధాని అవుతారు కదా మోదీ గారు, మీరే నాకు న్యాయం చెయ్యాలని ఆమె మనవి చేసింది. బెంగళూరు సిటీ మాజీ డిప్యూటీ మేయర్ ఆత్మహత్యాయత్నం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరు మాజీ డిప్యూటీ మేయర్
బెంగళూరు నగరంలోని బీటీఎం లేఔట్ లో బెంగళూరు సిటీ మాజీ డిప్యూటీ మేయర్ (బీబీఎంపీ) శహతాజ్ బేగం అలియాస్ శహతాజ్ అనే మహిళ నివాసం ఉంటున్నారు. బెంగళూరు సిటీ మాజీ డిప్యూటీ మేయర్ శహతాజ్ బేగం ఆమె ఇంటిలోనే ఆత్మహత్యాయత్నం చేసి వీడియో తీసి విడుదల చెయ్యడం కలకలం రేపింది.

భర్త, పోలీసులు టార్చర్ పెడుతున్నారు
చీరతో ఉరి వేసుకుని వీడియో తీసిన బెంగళూరు మాజీ డిప్యూటీ మేయర్ శహతాజ్ ప్రధాని నరేంద్ర మోదీకి వీడియో పంపిస్తూ ఆత్మహత్యాయత్నం చేసింది. తన భర్త అన్వర్ పాషా, కేఆర్ పురం పోలీసు అధికారులు తనను టార్చర్ పెడుతున్నారని, మీరే నాకు రక్షణ కల్పించాలని, లేదంటే నేను ఆత్మహత్య చేసుకోవడానికి మీ అనుమతి కావాలని శహతాజ్ ప్రధాని మోదీకి మనవి చేశారు.

పేపర్ లో తలాక్ యాడ్ ఇచ్చిన భర్త
తన సమీప బంధువు అయిన అన్వర్ పాషాతో తనకు చాలా సంవత్సరాల క్రితం వివాహం అయ్యిందని, మద్యంకు బానిస అయిన తన భర్త పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను టార్చర్ పెట్టాడని శహతాజ్ ఆరోపించింది. 2011లో ఓ పత్రికలో తనకు విడాకులు ఇస్తున్న తలాక్ చెప్పాడని, తరువాత తాను కోర్టుకు వెళ్లానని, న్యాయస్థానంలో తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని శహనాజ్ ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడిన వీడియోలో చెప్పారు.

మీరు కూడా మాజీ ప్రధాని అవుతారు కదా ?
కేఆర్ పురం సీఐ నందీష్, లేడీ ఎస్ఐ అనితా తనను బెదిరిస్తున్నారని శహతాజ్ ఆరోపించారు. నువ్వు మాజీ డిప్యూటీ మేయర్ మాత్రమే, ఎక్కువ చెయ్యకూడదు అంటూ లేడీ ఎస్ఐ అనితా, కేఆర్ పురం పోలీసులు తనను బెదిరిస్తున్నారని శహతాజ్ ఆరోపించారు. కొంతకాలం తరువాత మీరు కూడా మాజీ ప్రధాని అవుతారు కదా శహతాజ్ అన్నారు.

ప్రధానికి సూటీ ప్రశ్న
వైట్ ఫీల్డ్ డీసీపీకి ఫిర్యాదు చేసినా నాకు న్యాయం జరగలేదని శహతాజ్ ఆరోపించారు. మీరు మాజీ ప్రధాని అయిన తరువాత మీతో కూడా పోలీసు అధికారులులు ఇలాగే ప్రవర్థిస్తారా ?, మోదీ గారు, మీరే నాకు న్యాయం చెయ్యాలని, నాకు రక్షణ కల్పించాలని శహతాజ్ మనవి చేశారు. బెంగళూరు సిటీ మాజీ డిప్యూటీ మేయర్ శహతాజ్ ఆత్మహత్యాయత్నం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications