Lady leader: స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో నల్లజెండాలతో హంగామా, రాసలీలల వీడియోతో !
బెంగళూరు/బెళగావి: ప్రభుత్వ సీనియర్ అధికారితో రాసలీలలు సాగించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం నాయకురాలిని స్వాతంత్ర దినోత్సవం రోజు పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ అధికారి రాసలీలలు సాగించే సమయంలో రహస్యంగా వీడియోలు తీసిన కొందరు వాటిని విడుదల చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకురాలు వివాదంలో చిక్కుకున్నారు. ఇదే సందర్బంలో సదరు ప్రభుత్వ అధికారి మీద ఆమె కేసు పెట్టారు. కేసు పెట్టి ఇన్ని రోజులు అయినా ప్రభుత్వ అధికారిని అరెస్టు చెయ్యాలేదని, ప్రభుత్వం, పోలీసుల కారణంగా తనకు అన్యాయం జరిగిందని మంత్రి ముందు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల సందర్బంగా నల్లజెండాలు ఊపుతూ జాతీయ జెండా ఎగరవేసే సమయంలో హంగామా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయురాలిని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు
కర్ణాటకలోని రామనగర జిల్లాలోని చెన్నపట్టణ (బెంగళూరుకు 50 కిలోమీటర్ల దూరంలోని ఊరు)కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆర్ టీఐ కార్యకర్త నవ్యశ్రీ రావ్ అలియాస్ నవ్యశ్రీ ఇటీవల వివాదంలో చిక్కుకున్నారు. కర్ణాటక ఉద్యానవనాలు, తోటల పెంపకం శాఖ సీనియర్ అధికారి రాజ కుమార్ టాకళెతో నవ్యశ్రీ చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు రావడం కలకలం రేపాయి.

రాసలీలల వీడియోతో షాక్
కర్ణాటక ఉద్యానవనాలు, తోటల పెంపకం శాఖ సీనియర్ అధికారి రాజ కుమార్ టాకళె, కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం నాయకురాలు నవ్యశ్రీ ఏకాంతంగా చాలా సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన వీడియో అంటూ కొందరు వాటిని సోషల్ మీడియాలో విడుదల చెయ్యడంతో వైరల్ అయ్యాయి. అంతకాలం రెండు జిల్లాలకే పరిమితం అయిన నవ్యశ్రీ కర్ఱాటక మొత్తం హాట్ టాపిక్ అయ్యింది.

అధికారి మీద కేసు పెట్టిన నవ్యశ్రీ
కర్ణాటక ఉద్యానవనాలు, తోటల పెంపకం శాఖ సీనియర్ అధికారి రాజ కుమార్ టాకళె తన మీద అత్యాచారం చేశాడని, అబార్షన్ చేయించాడని, దాడి చేశాడని, తన ప్రైవేట్ వీడియోలు విడుదల చేశారని నవ్యశ్రీ ఇప్పటికే కేసు పెట్టింది. తాను కేసు పెట్టినా రాజ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చెయ్యలేదని ఆమె పోలీసుల మీద, కర్ణాటక ప్రభుత్వం మీద మండిపడుతోంది.

మంత్రి ముందే హంగామా
బెళగావిలోని జిల్లా క్రీడామైదానంలో సోమవారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో కర్ణాటక మంత్రి గోవింద జారకిహోళి పాల్గొన్ని జాతీయ జెండా ఎగరవేశారు. ఆ సందర్బంలో నవ్యశ్రీ అక్కడ నల్ల జెండాలు ప్రదర్శించి నానా హంగామా చేసింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా నవ్యశ్రీ నల్లా జెండాలతో ఎంట్రీ ఇవ్వడం కలకలం రేపింది.

దెబ్బకు మేడమ్ ఢమాల్
ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్ మీ కేసు పెట్టి ఇన్ని రోజులు అయినా ఆయన్ను అరెస్టు చెయ్యాలేదని, ప్రభుత్వం, పోలీసుల కారణంగా తనకు అన్యాయం జరిగిందని మంత్రి గోవింద జారకిహోళి ముందు నవ్యశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తూ నానా హంగామా చేసింది. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల సందర్బంగా నల్లజెండాలు ఊపుతూ జాతీయ జెండా ఎగరవేసే సమయంలో హంగామా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయురాలు నవ్యశ్రీని పోలీసులు అరెస్టు చెయ్యడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. మాజీ సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులతో నవ్యశ్రీ తీసుకున్న ఇటీవల విడుదల కావడంతో వైరల్ అయ్యాయి.
-
మెట్టినిల్లు వేదికగా శ్రీరామనవమి సాక్షిగా కవిత కొత్త పార్టీపై కీలక ప్రకటన! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications