Scam: అధికార పార్టీ లీడర్ భర్త అరెస్టు, ఏకంగా ఎస్ఐ ఉద్యోగాలు టార్గెట్, మేడమ్ ఎక్కడున్నారో ?, వేట !

బెంగళూరు: పోలీసు సబ్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాల నియామకాల పరీక్షల్లో గోల్ మాల్ వ్యవహారం కేసులో రోజుకొకరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ దెబ్బతో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు షాక్ అయ్యారు. ఎస్ఐ ఉద్యోగాల నియామకం అవకతవల వ్యవహారం ఆ రాష్ట్రంలోని అధికార పార్టీకి తలనొప్పిగా తయారైయ్యింది. విద్యాసంస్థల యజమాని, బీజేపీ లేడీ లీడర్ దివ్యా వ్యవహారం బయటకు రావడం, ఆమె భర్తను సీఐడీ అధకారులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. లేడీ లీడర్ స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న ముగ్గురు మహిళలను ఇప్పటికే అరెస్టు చేశారు. సీఐడీ పోలీసులు అధికార పార్టీ నాయకురాలి ఇంటిలో సోదాలు చేశారు. లేడీ లీడర్ మాయం కావడంతో ఆమె భర్తను అరెస్టు చేశారు. లేడీ లీడర్ విద్యాసంస్థల్లో ఎస్ఐ ఉద్యోగాలకు పరీక్షలు రాసిన ముగ్గురు అరెస్టు అయ్యారు. ఎస్ఐ ఉద్యోగాల పరీక్షల గోల్ మాల్ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో అధికార పార్టీ నాయకురాలి కుమ్మక్కు అయ్యారని ఆరోపణలు వచ్చిన వెంటనే ఆమె మాయం అయ్యారు. లేడీ లీడర్ కోసం సీఐడీ పోలీసులు వేట ముమ్మరం చేశారు.

 ఎస్ఐ ఉద్యోగాలు

ఎస్ఐ ఉద్యోగాలు

కర్ణాటకలో ఇటీవల పోలీసు సబ్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాలకు రాతసరీక్షలు జరిగాయి. ఎస్ఐ ఉద్యోగాలు సంపాధించాలని వేలాది మంది నిరుద్యోగులు రాతపరీక్షలకు హాజరైనారు. కలబురిగి బీజేపీ నాయకురాలు దివ్యాకు చెందిన జ్ఞానజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పరీక్షా కేంద్రంలో నిరుద్యోగులు ఎస్ఐ పరీక్షలు రాశారు.

 బీజేపీ లీడర్ దివ్యా స్కూల్ లో ఏం జరిగింది ?

బీజేపీ లీడర్ దివ్యా స్కూల్ లో ఏం జరిగింది ?

బీజేపీ నాయకురాలు అయిన దివ్యా జ్ఞానజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎస్ఐ పరీక్షలకు హాజరైనా అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారని వెలుగు చూడటంతో పోలీసులు అధికారులు ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ నాయకురాలు దివ్యాకు చెందిన జ్ఞానజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో పరీక్షలు రాసిన అభ్యర్థుల ఐఎంఆర్ షీట్లలో భారీగా అవకతవకలు జరిగాయని, కొందరు ఐఎంఆర్ షీట్లు ఖాళీగా ఇచ్చిన తరువాత కొందరు లెక్సరర్స్ ఆ జవాబు పత్రాల్లో అన్సర్లు రాశారని ఆరోపణలు వచ్యాయి.

 లేడీ లీడర్ దివ్యా భర్త అరెస్టు

లేడీ లీడర్ దివ్యా భర్త అరెస్టు

లేడీ లీడర్ దివ్యా స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న సుమిత్రా, సుమా, సిద్దమ్మ అనే ముగ్గురు మహిళా టీచర్లను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. సీఐడీ పోలీసులు అధికార పార్టీ నాయకురాలు దివ్యా ఇంటిలో సోదాలు చేశారు. లేడీ లీడర్ దివ్యా మాయం కావడంతో ఆమె భర్త రాజేష్ ను విచారణ చేసి చివరికి ఆయన్ను అరెస్టు చేశారు.

 మేడమ్ ఎక్కడున్నారో ?

మేడమ్ ఎక్కడున్నారో ?

సీఐడీ పోలీసులు బీజేపీ నాయకురాలు దివ్యా ఇంటిలో సోదాలు చేశారు. లేడీ లీడర్ మాయం కావడంతో ఆమె భర్త రాజేష్ ను అరెస్టు చెయ్యడంతో ఆమె అనుచరులు హడలిపోయారు. లేడీ లీడర్ దివ్యా విద్యాసంస్థల్లో ఎస్ఐ ఉద్యోగాలకు పరీక్షలు రాసిన ముగ్గురు అరెస్టు అయ్యారు. ఎస్ఐ ఉద్యోగాల పరీక్షల గోల్ మాల్ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో అధికార పార్టీ నాయకురాలు దివ్యా కుమ్మక్కు అయ్యారని ఆరోపణలు వచ్చిన వెంటనే ఆమె మాయం కావడంతో లేడీ లీడర్ కోసం సీఐడీ పోలీసులు వేట ముమ్మరం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+