Lady police: పట్టుకోవడానికి వెళ్లిన లేడి హెడ్ కానిస్టేబుల్ ను డ్రాగెన్ తో పొడిచిన షేక్ షరీఫ్ !
బెంగళూరు: ఐటీ హబ్ లో నివాసం ఉంటున్న ఓ యువకుడు క్రిమినల్ కేసుల్లో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లాడు. కొంతకాలం జైల్లో ఉన్న ఆ వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన నిందితుడు కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. నిందితుడు తలదాచుకున్న ప్రాంతం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ సందర్బంలో తప్పించుకోవడానికి నిందితుడు ప్రయత్నించాడు. నిందితుడిని పట్టుకోవడానికి ధైర్యంగా లేడీ హెడ్ కానిస్టేబుల్ ముందుకు వెళ్లారు. ఆ సందర్బంలో నిందితుడు లేడీ కానిస్టేబుల్ ను డ్రాగెన్ తో పొడిచేయడం కలకలం రేపింది.

క్రిమినల్ కేసుల్లో అరెస్టు
ఐటీ హబ్ బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న షేక్ షరీఫ్ (25) అనే యువకుడు హత్య, హత్యాయత్నం కేసులతో పాటు కొన్ని క్రిమినల్ కేసుల్లో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలుకు వెళ్లిన షేక్ షరీఫ్ కొంతకాలం జైలు జీవితం గిపాడు. కొంతకాలం తరువాత షేక్ షరీప్ బెయిల్ మీద బయటకు వచ్చాడు.

పోలీసులకు సమాచారం అందింది
బెయిల్ మీద బయటకు వచ్చిన నిందితుడు షేక్ షరీఫ్ కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. షేక్ షరీఫ్ ను కోర్టు ముందు హాజరుపరచాలని బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కొంతకాలం ప్రయత్నాలు చేస్తున్నారు. నిందితుడు షేక్ షరీఫ్ తలదాచుకున్న ప్రాంతం గురించి తెలుసుకున్న హెచ్ఏఎల్ పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు.

లేడీ హెడ్ కానిస్టేబుల్ ను డ్రాగెన్ తో పొడిచేశాడు
సాటి పోలీసుల వెంట లేడీ హెడ్ కానిస్టేబుల్ వినూతా (45) వెళ్లారు. ఆ సందర్బంలో తప్పించుకోవడానికి నిందితుడు షేక్ షరీఫ్ ప్రయత్నించాడు. నిందితుడు షేక్ షరీఫ్ ను పట్టుకోవడానికి ధైర్యంగా లేడీ హెడ్ కానిస్టేబుల్ వినూతా ముందుకు వెళ్లారు. ఆ సందర్బంలో నిందితుడు షేక్ షరీఫ్ లేడీ కానిస్టేబుల్ వినూతను డ్రాగెన్ తో పొడిచేశాడు.

నిందితుడికి బడిత పూజ చేసిన మామలు !
తప్పించుకోవడానికి ప్రయత్నించిన షేక్ షరీఫ్ ను సాటి పోలీసులు పట్టుకున్నారు. గాయాలైన లేడీ హెడ్ కానిస్టేబుల్ వినూతను ఆసుపత్రికి తరలించారు. లేడీ హెడ్ కానిస్టేబుల్ వినూతాను క్రిమినల్ షేక్ షరీఫ్ పొడవడం బెంగళూరులో కలకలం రేపింది. లేడీ పోలీసుల మీద దాడి చేసిన నిందితుడు షేక్ షరీఫ్ ను పోలీసులు బడితపూజ చేశారని తెలిసింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications